Richest Rich KID: తొమ్మిదేళ్ల కుర్రాడికి విలాసవంతమైన భవనం, ప్రైవేట్ జెట్, సూపర్ కార్స్

ఆరేళ్లకే విలాసవంతమైన భవంతి సొంతం చేసుకున్నాడు. తొమ్మిదేళ్ల వయస్సులో ప్రైవేట్ జెట్ విమానం, బోలెడు సూపర్ కార్లతో జీవితాన్ని గడిపేస్తున్నాడు.

Richest Rich KID: తొమ్మిదేళ్ల కుర్రాడికి విలాసవంతమైన భవనం, ప్రైవేట్ జెట్, సూపర్ కార్స్

Rich Kid

Richest Rich KID: ఆరేళ్లకే విలాసవంతమైన భవంతి సొంతం చేసుకున్నాడు. తొమ్మిదేళ్ల వయస్సులో ప్రైవేట్ జెట్ విమానం, బోలెడు సూపర్ కార్లతో జీవితాన్ని గడిపేస్తున్నాడు. ఏదో ఫిక్షనల్ క్యారెక్టర్ లా అనిపించినా.. ఇది నిజమైన 9ఏళ్ల బుడ్డోడి స్టోరీనే.

మొహమ్మద్ అవాల్ ముస్తఫా.. అలియా్ మొంఫా జూనియర్.. మల్టీ మిలీయనీర్ నైజీరియన్ ఇంటర్నెట్ సెలబ్రిటీ ఇస్మాయిలియా ముస్తఫాకు కొడుకు. ఈ బుడ్డోడి ఖర్చు విషయంలోనే ఇన్ స్టాలో ఫాలోవర్ల విషయంలోనూ రిచ్చే. అతని అకౌంట్ కు 1.1 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు మరి.

కేవలం 9పోస్టులు పెట్టి.. 26వేల మంది ఫాలోవర్లను సొంతం చేసుకున్నాడు. ఇక డబ్బు ఉంది బట్టలకేం కొదవ. స్టైలిష్ క్లాతింగ్ తో సూపర్ కార్ల దగ్గర నిలబడి పోజులిస్తూ ఆ ఫొటోలను ఇన్ స్టాలో పెడుతుంటాడు. ఒకసారి తన ప్రైవేట్ జెట్ లో ఫుడ్ తింటూ అది కూడా పోస్టు చేశాడు.

ఆరేళ్ల వయస్సుకే ఓ విలాసవంతమైన భవంతిని కట్టించి బహుకరించాడు అతని తండ్రి. దాని గురించి పోస్టు పెట్టిన మొంఫా.. జీవితంలో కష్టాలు, విజయాలు ఏమొచ్చినా ఎప్పుడూ ఒకేలా స్వాగతించేది ఒక్కటే. అదే మన ఇల్లు. మీ డాడీ నుంచి నీకిదే బర్త్ డే గిఫ్ట్. అంటూ సోషల్ మీడియాలో తండ్రి మాటలు గుర్తు చేసుకుంటూ పోస్టు పెట్టడు. అతని ఖర్చులకు, రిక్వైర్మెంట్స్ ను బట్టి ఏ లిస్ట్ సెలబ్రిటీగా పరిగణిస్తున్నారు.