Rishi Sunak Cars : రిషి సునాక్ గ్యారేజిలో ఖరీదైన కార్లు .. శక్తివంతమైన పేలుడును కూడా తట్టుకోగల స్ట్రాంగెస్ట్ కారు ప్రత్యేకత

రిషి సునక్. ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగిపోతున్న పేరు. భారతీయ మూలాలున్న వ్యక్తి బ్రిటన్ ప్రధాని కావటంతో రిషి సునక్ పేరు మోగిపోతోంది. ఆయన ప్రొఫెల్ నుంచి ఆయన లైఫ్ స్టైల్ ఏంటీ? అనే ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలో రిషి సునక్ కు ఉన్న కార్ల లిస్ట్ కూడా వార్తల్లో హల్ చల్ చేస్తోంది. బ్రిటన్ లోని ధనవంతుల్లో 222వస్థానంలో ఉన్న రిషికి ఎన్నికార్లు ఉన్నాయి? ఎలాంటి కార్లు ఉన్నాయి? ఆయన కార్లకున్న ప్రత్యేకతలేంటీ? అనేది ఆసక్తికరంగా మారింది. రిషి సునక్ వద్ద ఉన్న లగ్జరీ కార్లు గురించి తెలుసుకుందాం...

Rishi Sunak Cars : రిషి సునాక్ గ్యారేజిలో ఖరీదైన కార్లు .. శక్తివంతమైన పేలుడును కూడా తట్టుకోగల స్ట్రాంగెస్ట్ కారు ప్రత్యేకత

Rishi Sunak have Jaguar XJ L car

Rishi Sunak have Jaguar XJ L car : రిషి సునక్. ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగిపోతున్న పేరు. భారతీయ మూలాలున్న వ్యక్తి బ్రిటన్ ప్రధాని కావటంతో రిషి సునక్ పేరు మోగిపోతోంది. ఆయన ప్రొఫెల్ నుంచి ఆయన లైఫ్ స్టైల్ ఏంటీ? అనే ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలో రిషి సునక్ కు ఉన్న కార్ల లిస్ట్ కూడా వార్తల్లో హల్ చల్ చేస్తోంది. బ్రిటన్ లోని ధనవంతుల్లో 222వస్థానంలో ఉన్న రిషికి ఎన్నికార్లు ఉన్నాయి? ఎలాంటి కార్లు ఉన్నాయి? ఆయన కార్లకున్న ప్రత్యేకతలేంటీ? అనేది ఆసక్తికరంగా మారింది. రిషి సునక్ వద్ద ఉన్న లగ్జరీ కార్లు గురించి తెలుసుకుందాం…

బ్రిటన్ 57వ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రిషి సునాక్ సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి అనే విషయం తెలిసిందే. బ్రిటన్ లోని అత్యంత ధనికుల్లో రిషి సునాక్ 222వ స్థానంలో ఉన్నారాయన. ఆయన వద్ద పరిమిత సంఖ్యలోనే కార్లు ఉన్నా, అవి ఎంతో ఖరీదైనవిగా ఉన్నాయి. ఈ భారత సంతతి నేత వద్ద ఫోక్స్ వాగన్ గోల్ఫ్ జీటీఐ, జాగ్వార్ ఎక్స్ జే ఎల్, లాండ్ రోవర్ డిస్కవరీ, రేంజ్ రోవర్ సెంటినల్ వంటి లగ్జరీ వాహనాలు ఉన్నాయి. వీటిలో జాగ్వార్ ఎక్స్ జే ఎల్ మోడల్ కారు అత్యంత శక్తిమంతమైనది. ఈకారు మందుపాతరల పేలుడును కూడా తట్టుకోగలదు. ఇది అల్ట్రా లగ్జరీ సెడాన్ సెగ్మెంట్ కు చెందిన కారు.

Leaders of Indian Origin in the World : ప్రపంచ దేశ రాజకీయాలను శాసిస్తున్న మన భారతీయులు .. పలు దేశాల్లో భారత సంతతి వ్యక్తులదే కీ రోల్..

లగ్జరీ మాత్రమే కాదు..అందులో ప్రయాణించేవారి భద్రతకు కూడా పెద్దపీట వేసేలా ఇందులోని ఫీచర్లు ఉన్నాయి. కారు కింది భాగంలో 13 ఎంఎం మందంతో లోహపు ప్లేటు ఏర్పాటు చేశారు. కింది భాగంలో ఎంతటి శక్తివంతమైన పేలుడు సంభవించినా..ఈ ఉక్కు ప్లేటు పేలుడును అడ్డుకుంటుంది. కారులో ఉన్నవారికి ఎటువంటి ప్రమాదం లేకుండా అడ్డుకుంటుంది. అంతేకాదు, కారుపై కెవ్లార్, టైటానియం గార్డు ఉంటుంది. ఇది తుపాకీ గుళ్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. బుధవారం (అక్టోబర్ 26,2022)ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రిషి సునాక్ ఈ కారును ఎప్పటినుంచో వినియోగిస్తున్నారు.

ఈ కారులో పోర్టబుల్ ఆక్సిజన్ ట్యాంకులు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ జాగ్వార్ ఎక్స్ జే ఎల్ కారులో 3.0 లీటర్ టర్బోచార్జ్ డ్ వీ6 ఇంజిన్ అమర్చారు. ఇది 225 బీహెచ్ పీ శక్తిని విడుదల చేస్తుంది. కేవలం 4 సెకన్లలోనే 100 కిమీ వేగం అందుకోగలదు. దీని ధర గరిష్ఠంగా రూ.1.97 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఇక..రిషి సునాక్ లండన్ నగరంలో విహరించేందుకు ఫోక్స్ వాగన్ గోల్ఫ్ జీటీఐ కారును ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఇది గంటకు 240 కిమీ వేగంత దూసుకెళ్లగలదు.

Indian origin CEOs : సీఈవోల ఫ్యాక్టరీగా భారత్ .. ప్రపంచ వ్యాప్తంగా పలు కార్పోరేట్ కంపెనీల్లో భారతీయుల హవా..