Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్ హత్యకు యత్నం.. దాడులు.. క్రెమ్లిన్‌ వద్ద పొగలు.. వీడియో

Vladimir Putin: డ్రోన్లతో దాడి చేసిన తర్వాత పొగలు చెలరేగిన వీడియోను రష్యా మీడియా ప్రసారం చేసింది.

Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్ హత్యకు యత్నం.. దాడులు.. క్రెమ్లిన్‌ వద్ద పొగలు.. వీడియో

Vladimir Putin

Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin)ను హత్య చేయడానికి ప్రయత్నాలు జరిగాయని ఆ దేశ అధికారులు తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ (Russia, Ukraine) మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధం ఉక్రెయిన్ భూభాగంలో జరుగుతూ వస్తోంది. రష్యాలోని ప్రధాన భూభాగాల్లో ఉక్రెయిన్ దాడులు చేసే సాహసం చేయట్లేదు.

అయితే, గత రాత్రి మాత్రం ఉక్రెయిన్ రెండు డ్రోన్లను పుతిన్ నివాస ప్రాంతానికి పంపి దాడులు చేసేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. ఆ రెండు డ్రోన్లను తాము ధ్వంసం చేశామని రష్యా ప్రకటించింది. వాటిని తిప్పికొట్టే హక్కు తమకు ఉందని చెప్పింది. ఇదో ఉగ్రవాద చర్యగా తాము పరిగణిస్తున్నామని క్రెమిన్ పేర్కొంది.

క్రెమ్లిన్ భవనం వద్ద పలు వస్తువులు ధ్వంసం అయ్యాయని చెప్పింది. ఈ దాడిలో పుతిన్ కు గాయాలు కాలేదని వివరించింది. పుతిన్ నివాస ప్రాంతం వద్ద పొగలు వ్యాపించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. గతంలోనూ ఇటువంటి దాడులు జరిగాయని రష్యా అప్పట్లో పేర్కొంది.

అయితే, వాటికి బాధ్యతవహిస్తున్నట్లు ఉక్రెయిన్ ఏనాడూ ప్రకటన చేయలేదు. కొన్ని నెలలుగా ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం జరుగుతోంది. రష్యా దాడులను ఎదుర్కోవడానికి ఉక్రెయిన్ కు పశ్చిమ దేశాలు సహకరిస్తున్నాయి. మిలటరీ, సాంకేతికత, ఆర్థిక సాయం చేస్తున్నాయి.

US Mud Run : మడ్ రేసులో పరుగులు తీసిన 84 ఏళ్ల బామ్మగారు.. వయసు జస్ట్ నంబర్ మాత్రమే..