Kim’s Daughter: కిమ్ జోంగ్ ఉన్ ఇటీవల పరిచయం చేసిన కూతురి లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా?

వాన్సన్ లోని సముద్రం పక్కన ఉండే అతి పెద్ద విల్లాలో ఆ పాప ఉంటుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఫ్లోరిడాలో ఉన్న మార్-ఎ-లాగోలాగే అది ఉంటుంది. ఆ పాప ఉండే ఆ ఎస్టేట్ లో స్విమ్మింగ్ పూల్స్, టెన్నిస్ కోర్టులు, సాకర్ మైదానం, ఓ స్పోర్ట్స్ స్టేడియం ఉంటాయి. ఉత్తరకొరియా కిమ్ కుటుంబానికి మొత్తం 15 విలాసవంతమైన భవనాలు ఉన్నాయి.

Kim’s Daughter: కిమ్ జోంగ్ ఉన్ ఇటీవల పరిచయం చేసిన కూతురి లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా?

Kim’s Daughter: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఇటీవల ప్రపంచానికి పరిచయం చేసిన ఆయన కూతురి గురించి ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఇటీవల తన కూతురితో కలిసి కిమ్ జోంగ్ ఉన్ ఖండాంతర క్షిపణి ప్రయోగాన్ని చూసిన విషయం తెలిసిందే. కిమ్ తన రెండో కూతురిని తీసుకువచ్చారని, ఆమె పేరు జు ఏ అని దక్షిణ కొరియా జాతీయ నిఘా సంస్థ స్పష్టం చేసింది.

ఇప్పుడు ఆమెకు సంబంధించిన మరిన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం… కిమ్ కూతురు జు ఏ ఎవరూ ఊహించనంత అత్యంత విలాసమైన జీవితాన్ని గడుపుతోంది. వాన్సన్ లోని సముద్రం పక్కన ఉండే అతి పెద్ద విల్లాలో ఆ పాప ఉంటుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఫ్లోరిడాలో ఉన్న మార్-ఎ-లాగోలాగే అది ఉంటుంది.

ఆ పాప ఉండే ఆ ఎస్టేట్ లో స్విమ్మింగ్ పూల్స్, టెన్నిస్ కోర్టులు, సాకర్ మైదానం, ఓ స్పోర్ట్స్ స్టేడియం ఉంటాయి. ఉత్తరకొరియా కిమ్ కుటుంబానికి మొత్తం 15 విలాసవంతమైన భవనాలు ఉన్నాయి. ఒకచోటి నుంచి ఒక చోటుకి వెళ్లాలంటే ఆ కుటుంబం సొరంగాల అండర్ గ్రౌండ్ నెట్ వర్క్ నుంచి వెళ్తుంది. విదేశీ నిఘా సంస్థలు కిమ్ కుటుంబ జాడను గుర్తించేందుకు వీలులేకుండా ఉండే నెట్ వర్క్ ను ఈ సొరంగాల్లో వాడతారు. కిమ్ జోంగ్ కూతురిని ఆమె సంరక్షకులు అల్లారుముద్దుగా చూసుకుంటారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..