Texas twin girls: కవల పిల్లలు పుట్టారు.. కానీ, వేర్వేరు తేదీలు, సంవత్సరాల్లో…

వీరిద్దరు కవల పిల్లలు. కానీ, వీరు వేర్వేరు తేదీలు, సంవత్సరాల్లో పుట్టారు. ప్రపంచం మొత్తం నూతన సంవత్సర వేడుకల్లో మునిగి ఉన్న వేళ ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. మొదటి శిశువు 2022 డిసెంబరు 31 రాత్రి 11.55 గంటలకు పుడితే ఆ తర్వాత ఆరు నిమిషాలకు.. అంటే 2023 జనవరి 1న అర్ధరాత్రి 12.01 గంటలకు రెండో శిశువు పుట్టింది. ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్ లో చోటుచేసుకుంది.

Texas twin girls: కవల పిల్లలు పుట్టారు.. కానీ, వేర్వేరు తేదీలు, సంవత్సరాల్లో…

Texas twin girls

Texas twin girls: వీరిద్దరు కవల పిల్లలు. కానీ, వీరు వేర్వేరు తేదీలు, సంవత్సరాల్లో పుట్టారు. ప్రపంచం మొత్తం నూతన సంవత్సర వేడుకల్లో మునిగి ఉన్న వేళ ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. మొదటి శిశువు 2022 డిసెంబరు 31 రాత్రి 11.55 గంటలకు పుడితే ఆ తర్వాత ఆరు నిమిషాలకు.. అంటే 2023 జనవరి 1న అర్ధరాత్రి 12.01 గంటలకు రెండో శిశువు పుట్టింది. ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్ లో చోటుచేసుకుంది.

కాన్పు కోసం కలీ జో మహిళ టెక్సాస్ లోని ఓ ఆసుపత్రిలో చేరింది. ఈ ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. పండంటి ఇద్దరు ఆడ పిల్లలు పుట్టడంతో కలీ జో భర్త క్లిఫ్ సంబరపడిపోయాడు. కవలలు అయినప్పటికీ మొదటి కూతురు ఓ తేదీ, సంవత్సరంలో పుడితే రెండో కూతురు మరో తేదీ, సంవత్సరంలో పుట్టిందని తెలిపాడు.

ప్రథమ పుత్రికకు అన్నీ జో అని, ద్వితీయ పుత్రికకు ఎఫ్పీ రోజ్ అని పేరు పెట్టినట్లు చెప్పాడు. ఆ పిల్లల ఫొటోలు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను కలీ జో తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. శిశువులు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని, 5.5 పౌండ్ల చొప్పున బరువు ఉన్నారని పేర్కొంది. ఇద్దరు పిల్లలు పుట్టడంతో తాను, తన భర్త చాలా ఎంజాయ్ చేస్తున్నామని చెప్పింది.

కాగా, సాధారణంగా కవలలు పుడితే వారిద్దరి పుట్టినరోజును ఒకేసారి చేస్తారు. కానీ, ఈ మహిళకు పుట్టిన కవలలు వేర్వేరు రోజుల్లో పుట్టడంతో రెండు రోజులు వేడుక చేసుకోవచ్చంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. ప్రతి ఏడాది న్యూ ఇయర్ కు స్వాగతం పలుకుతున్న వేళ వారి పుట్టినరోజు చేస్తే సరిపోతుందని మరి కొందరు నెటిజన్లు పేర్కొన్నారు.

Congress Leaders Padayatra : కాంగ్రెస్ లో పాదయాత్రల కుమ్ములాట.. రేవంత్ పాదయాత్రపై సీనియర్లు అసంతృప్తి