Azature : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్.. దీని కాస్ట్‌తో మూడు బెంజ్ కార్లు కొనొచ్చట

ఆడవారి వాడే ఉత్పత్తుల్లో ఖరీదైన నగలు, చెప్పులు, దుస్తులు గురించి విని ఉంటాం. కానీ అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్ గురించి విన్నారా? దాని ధర వింటే అవాక్కవుతారు.

Azature : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్.. దీని కాస్ట్‌తో మూడు బెంజ్ కార్లు కొనొచ్చట

Azature

Azature : ఆడవారు గోరింటాకు, నెయిల్ పాలిష్ అంటే చాలా ఇష్టపడతారు. ముఖ్యంగా గోళ్లకు రంగు రంగుల నెయిల్ పాలిష్ వేసుకుంటారు. అందుబాటు ధరల్లో ఉండే నెయిల్ పాలిష్‌ల గురించి అందరికీ తెలుసు. కానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్ గురించి మీకు తెలుసా.. దానిని కొనే ధరకు మూడు బెంజ్ కార్లు కొనొచ్చట.. వామ్మో.. అంత ప్రత్యేకత ఏం ఉంది? అని ఆశ్చర్యపోతున్నారా? చదవండి.

Mehendi leaves : ఏడాదిలో రెండుసార్లైనా గోరింటాకు పెట్టుకుంటే.. మహిళల్లో హార్మోన్లు పనితీరు..?

ఖరీదైన కార్లు, గడియారాలు, వజ్రాలు, ఫర్నిచర్ గురించి అందరికీ తెలుసు. ఆడవారు వాడే వస్తువుల్లో ఖరీదైన దుస్తులు, చెప్పులు, బెల్ట్‌ల గురించి విని ఉంటారు. అయితే ఓ ప్రాడక్ట్ ధర చెబితే అవాక్కవుతారు.  అదే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్. పేరు అజాచర్.. లాస్ ఏంజెల్స్‌కు చెందిన డిజైనర్ అజాచర్ పోగోసియన్ దీనిని తయారు చేసారు. ఈ నెయిల్ పాలిష్‌కి చాలా ప్రత్యేకత ఉండబట్టే ఇంత ఖరీదు పలుకుతోంది.

అజాచర్ ..బ్లాక్ అండ్ డైమండ్ నెయిల్ పాలిష్ కొనాలంటే రూ.1 కోటి ఖర్చు అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా లగ్జరీ వస్తువులను తయారు చేసే అజాచర్ పోగోసియన్ తన పేరుతో ఈ ఖరీదైన నెయిల్ పాలిష్ తయారు చేసాడు. దూరం నుంచి చూస్తే ఈ నెయిల్ పాలిష్ చాలా సాధారణంగా అనిపిస్తుంది. కాస్త నిశితంగా పరిశీలిస్తే ఈ నెయిల్ పాలిష్‌లో 267 క్యారెట్ బ్లాక్ డైమండ్ కనిపిస్తుంది. దీనికి రూ. 1,63,66,000 ఖర్చవుతుంది. దీని ధరతో 3 Mercedes-Benz GLA కొనుగోలు చేయవచ్చునట.

Indian womans Cosmetics : మేకప్ కోసం రూ.5,000 కోట్లు ఖర్చు చేసిన భారతీయ మహిళలు

ఈ నెయిల్ పోలిష్ ఇప్పటివరకు ఎవరు కొని ఉండరు అని మీరు అనుకోవచ్చు. కొన్ని నివేదికల ప్రకారం 25 మంది బ్లాక్ డైమండ్ నెయిల్ పాలిష్‌ను కొనుగోలు చేసారట. దీనిని బట్టి వారెంత రిచ్ అనేది అర్ధం చేసుకోవచ్చు.