Pakistan Slogans: ఉత్తరప్రదేశ్‌లో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు

ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ అల్లర్లు చేపట్టారు. బుధవారం జరిగిన ఈ ఘటనలో మతపరమైన అల్లర్లు సృష్టిస్తున్నారని ముగ్గుర్ని అరెస్ట్ చేశారు పోలీసులు.

Pakistan Slogans: ఉత్తరప్రదేశ్‌లో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు

Pakistan Zindabad

Updated On : October 21, 2021 / 12:22 PM IST

Pakistan Slogans: ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ అల్లర్లు చేపట్టారు. బుధవారం జరిగిన ఈ ఘటనలో మతపరమైన అల్లర్లు సృష్టిస్తున్నారని ముగ్గుర్ని అరెస్ట్ చేశారు పోలీసులు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో పోస్టు కావడంతో పోలీసులు దానిపై దర్యాప్తు చేస్తున్నారు.

వీడియో క్లిప్పింగ్ లో ఉన్న సమాచారాన్ని బట్టి ఆ ముగ్గుర్ని గుర్తించారు. సెక్టార్ 20 పోలీస్ స్టేషన్ ఏరియాలో మంగళవారం ఈద్ ఉల్ మిలాద్ ఉన్ నబీ జరుపుకున్నారు. ఈ సందర్భంగా సెక్యూరిటీగా వచ్చిన పోలీసు సిబ్బంది ఇటువంటి నినాదాలు వినిపించాయి.

‘ వారిలో ముగ్గుర్ని అరెస్టు చేశాం. వీడియో ఆధారంగా ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నాం. ముందుగా హిందూస్తాన్ జిందాబాద్ అంటూ అరుస్తూ మధ్యలో పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు చేశారు. దీనిపై విచారణ జరపాల్సి ఉంది’ అని పోలీసు ఉన్నతాధికారి చెప్పారు.

…………………………………….. : కోడి గుడ్డు తిన్నా బరువు తగ్గొచ్చు…

నోయిడా అడిషనల్ డీసీపీ ర్యాన్ విజయ్ సింగ్.. మా దగ్గర వీడియో ఉంది. నిపుణుల పర్యవేక్షణలో దానిని పరిశీలిస్తున్నాం. విచారణ జరిపిన తర్వాత సంబంధిత సెక్షన్ల ప్రకారం.. కేసు నమోదు చేస్తాం అని ఆయన అన్నారు.