Boy plays with snake : రెండేళ్ల బుడ్డోడు 12 అడుగుల పాము తోక పట్టుకుని ఆటలు..

రెండేళ్ల బుడ్డోడు 12 అడుగుల పాము తోక పట్టుకుని ఆటలాడుతున్న వీడియో వైరల్ గా మారింది.

Boy plays with snake : రెండేళ్ల బుడ్డోడు 12 అడుగుల పాము తోక పట్టుకుని ఆటలు..

2 Years Child Plays With Snake

2 years child plays with snake : చిన్నపాము పిల్ల కనిపిస్తే ఆరు అడుగుల మనిషి అయినా వణికిపోతాం.ఆఖరికి బొమ్మ పాము కనిపించినా హడలిపోతాం. అటువంటిది ఓ రెండేళ్ల పిల్లాడు ఒకటీ రెండు కాదు 12 అడుగుల పొడుగున్న పాము తోక పట్టుకుని ఆడిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ భారీ పాము తోక పట్టుకుని లాగటమే కాకుండా పామును లాగ‌డ‌మే కాదు.. దాంతో ఏదో బొమ్మపాముతో ఆడుకున్నట్లుగా దాన్ని అటు ఇటు లాగుతు ఆటలాడుతున్నాడు. పాము చూస్తే భారీగా ఉంది.బుడ్డోడు చూస్తే బుడ్డి నిక్కరేసుకుని హల్ చల్ చేయటం చూస్తే ‘భడవా..ఎంత ధైర్యం రా నీకు’ పాముల్ని ఆడించే నాగరాజువా’ అనాలనిపిస్తుంది.

ఆస్ట్రేలియాకు చెందిన మ్యాట్ వ్రిట్ అనే వ్య‌క్తి ఎక్కడ పాము ఉందని తెలిస్తే అక్కడ వాలిపోతాడు.ఎంత పెద్ద పామునైనా సరే చిటికెలో పట్టేస్తాడు. అలా 20 ఏళ్లనుంచి పాముల్ని పడుతున్నాడు. ఈక్రమంలో పాముల్ని పట్టే మ్యాట్ ఇంటి ఆవ‌ర‌ణ‌లోకి దాదాపు 10 అడుగుల కంటే పెద్ద పొడువుగల ఓ పాము వ‌చ్చింది. ఈ పామును చూసిన మ్యాట్ రెండేళ్ల కొడుకు మా నాన్నలాగా నేను కూడా పాముల్ని పట్టేసుకుంటున్నానని చెప్పాలనుకున్నాడో ఏమోగానీ..ఆ పాము తోక పట్టుకుని లాగుతున్నాడు.

అంతేకాదు ఆ పామును వెన‌క్కి లాగుతూ ఎంజాయ్ చేశాడు. తోక‌ను విడిచి పాము త‌ల భాగం వ‌ద్ద‌కు వెళ్లి ప‌ట్టుకునేందుకు య‌త్నించాడు. ఓరినా బుల్లి బిడ్డా..నీకెందుకురా ఇప్పటినుంచీ ఈ పాముతో అని తండ్రి అనకపోగా..పాముల‌ను ఎలా ప‌ట్టాలో పిల్లాడికి తండ్రి మెళ‌కువ‌లు నేర్పిస్తున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియా వైర‌ల్ అవుతోంది.