UK PM Boris Johnson: 57ఏళ్ల వయస్సులో తండ్రి అవబోతున్న పీఎం బోరిస్ జాన్సన్

యూకే ప్రధాని బోరిస్ జాన్సన్, అతని భార్య క్యారీ జాన్సన్ మరో బిడ్డకు జన్మనివ్వనున్నారు. ఈ డిసెంబరులో తమ ఇంటికి కొత్త వ్యక్తి రాబోతున్నారంటూ ప్రకటించి కాస్త భయంగానూ ఉందని అంటున్నారు. 'మరోసారి ప్రెగ్నెంట్ అయినందుకు సంతోషంగా ఉంది.

UK PM Boris Johnson: 57ఏళ్ల వయస్సులో తండ్రి అవబోతున్న పీఎం బోరిస్ జాన్సన్

Uk Pm

UK PM Boris Johnson: యూకే ప్రధాని బోరిస్ జాన్సన్, అతని భార్య క్యారీ జాన్సన్ మరో బిడ్డకు జన్మనివ్వనున్నారు. ఈ డిసెంబరులో తమ ఇంటికి కొత్త వ్యక్తి రాబోతున్నారంటూ ప్రకటించి కాస్త భయంగానూ ఉందని అంటున్నారు. ‘మరోసారి ప్రెగ్నెంట్ అయినందుకు సంతోషంగా ఉంది. దాంతో పాటు ఈ మూమెంట్ కాస్త భయం కూడా కలిగిస్తుంది’ అని ఇన్ స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.

‘క్రిస్టమస్ నాటికి డెలివరీ అవుతుండగా.. గతేడాది కొన్ని కారణాల రీత్యా ఆమెకు గర్భస్రావం అయిందట. ‘సంవత్సరారంభంలో జరిగిన అబార్షన్ తో చాలా కుంగిపోయా’ అని పేర్కొన్నారు.

యూకే పీఎం బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ.. ‘చాలా మందిలో ఫెర్టిలిటీ సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. సోషల్ మీడియాల్లో ఇలా చాలాసార్లు చూస్తుంటాం. వారి అనుభవాలను పంచుకుంటే మిగిలిన వారికి ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నామని ప్రధాని వెల్లడించారు.

బోరిస్ జాన్సన్ ఇదే సంవత్సరం మే నెలలో సీక్రెట్ గా పెళ్లాడి మూడో భార్యను జీవితంలోకి ఆహ్వానించారు.