US : అమెరికాలో ఢీకొన్న 50 వాహనాలు..ముగ్గురు మృతి

అమెరికాలోని పెన్సిల్వేనియా హైవేపై ఏకంగా 50 వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి.

US : అమెరికాలో ఢీకొన్న 50 వాహనాలు..ముగ్గురు మృతి

50 Vehicles Pileup In Us After Snow Squall Leaves Three Dead (1)

50 Vehicles pileup in us after snow squall leaves Three dead  : అమెరికాలో ఘోర ప్రమాదం సంభవించింది. భారీగా పేరుకుపోయిన మంచు వల్ల ఈ ప్రమాదం సంభవించింది. ఈ మంచువల్ల అదుపుతప్పి పెన్సిల్వేనియా హైవేపై ఏకంగా 50 వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి.

అమెరికాలోని పెన్సిల్వేనియా హైవేపై సోమ‌వారం భారీగా మంచు కురిసింది. ద‌ట్ట‌మైన మంచు ఏర్ప‌డ‌టంతో వాహ‌నాల రాక‌పోక‌ల‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలో ఒక‌దానికొక‌టి 50 నుంచి 60 వాహ‌నాలు ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు మృతి చెంద‌గా, ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ 50 వాహ‌నాల్లో కార్ల‌ు, ట్రాక్టర్ ట్రాలీలు కూడా ఉన్నాయి.

ఈ ప్రమాదంతో హైవేపై ఉన్న మంచును తొల‌గించేందుకు అధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఇలాంటి ఘ‌ట‌న జ‌ర‌గ‌డం ఒకే నెల‌లో ఇది రెండోసారి అని పోలీసులు తెలిపారు.