US President Joe Biden: జో బైడెన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడా? శ్వేతసౌధం ఏమందంటే..

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడా.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వార్త చక్కర్లు కొడుతుంది. దీనికి కారణం.. గత రెండు రోజుల క్రితం జో బైడెన్ స్వయంగా తనకు క్యాన్సర్ ఉన్నట్లు చెప్పిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. దీంతో శ్వేతసౌధం స్పందించింది. బైడెన్ క్యాన్సర్ తో బాధపడుతున్నారా? అనే నెటిజన్ల ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.

US President Joe Biden: జో బైడెన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడా? శ్వేతసౌధం ఏమందంటే..

Joe Baien

US President Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడా.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వార్త చక్కర్లు కొడుతుంది. దీనికి కారణం.. గత రెండు రోజుల క్రితం జో బైడెన్ స్వయంగా తనకు క్యాన్సర్ ఉన్నట్లు చెప్పారు. బైడెన్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతుండటంతో శ్వేత సౌధం ఈ అంశంపై స్పందించింది. జో బైడెన్ కు క్యాన్సర్ ఉందా..? అందులో ఎంతవరకు నిజం ఉందనే విషయంపై స్పష్టత ఇచ్చింది.

Joe Biden: బైడెన్‌ పనైపోయింది.. ఆయన ఎక్కువకాలం పదవిలో కొనసాగలేరు.. రోనీ జాక్సన్ సంచలన వ్యాఖ్యలు..

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ బుధవారం మసాచుసెట్స్ లో సోమర్ సెట్లో పాత బొగ్గుగని ప్లాంట్ ను సందర్శించారు. వాతావరణ మార్పులపై పోరాటంలో భాగంగా ప్రభుత్వం జారీ చేసిన నూతన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై చర్చించారు. ఈ క్రమంలో బైడన్ మాట్లాడుతూ.. తన చిన్నతనంలో మా అమ్మ తనను కారులో తీసుకెళ్లేదని, ఆ సమయంలో పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం కారు లోపలికి రాకుండా విండ్ షీల్డ్ వైపర్స్ ఎప్పుడూ ఆన్ చేసి ఉండేవని అన్నారు. డెలావేర్ లో క్యాన్సర్ బాధితుల రేటు అధికం అని, ఈ పరిస్థితి వల్ల డెలావేర్ లో తనతో పాటు పెరిగిన చాలా మంది క్యాన్సర్ బారినపడ్డారని బైడన్ అన్నాడు.

బైడన్ వ్యాఖ్యలతో అమెరికన్ లు షాక్ కు గురయ్యారు. బైడన్ మాట్లాడిన వీడియో నిమిషాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు బైడన్ కు క్యాన్సర్ తగ్గిపోవాలని కోరుకుంటున్నాం అంటూ కామెంట్లు చేశారు. బైడెన్ వీడియో విపరీతంగా నెట్టింట్లో వైరల్ కావడంతో.. శ్వేతసౌధం స్పందించింది. బైడెన్ కు ప్రస్తుతం క్యాన్సర్ లేదని, అధ్యక్షుడు కావడానికి ముందే ఆయన చర్మ క్యాన్సర్ కు చికిత్స తీసుకున్నాడని తెలిపింది.