Viral video: స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతూ మూర్ఛపోయిన తల్లి.. కాపాడిన పదేళ్ల కొడుకు.. వీడియో వైరల్

మూర్ఛ రావడంతో స్విమ్మింగ్ పూల్‌లో మునిగిపోతున్న తల్లిని కాపాడాడు ఆమె పదేళ్ల కొడుకు. పరుగెత్తుకుంటూ వెళ్లి తల్లిని మునిగిపోకుండా రక్షించాడు. బాలుడి సమయస్ఫూర్తి, సాహసాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Viral video: స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతూ మూర్ఛపోయిన తల్లి.. కాపాడిన పదేళ్ల కొడుకు.. వీడియో వైరల్

Viral video: స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతూ, మూర్ఛ రావడంతో మునిగిపోతున్న తల్లిని కాపాడాడు పదేళ్ల కొడుకు. ఈ ఘటన అమెరికాలోని, ఒక్లాహామా రాష్ట్రంలో ఇటీవల జరిగింది. ఈ ఘటన అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డైంది. లోరీ కేనీ అనే మహిళ.. తమ ఫ్యామిలీ కోసం ఏర్పాటు చేసుకున్న స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతోంది.

Revanth Reddy: ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేయడమే టీఆర్ఎస్, బీజేపీ ఎజెండా: రేవంత్ రెడ్డి

ఆ సమయంలో పూల్‌లో ఆమె ఒక్కరు మాత్రమే ఈత కొడుతున్నారు. అయితే, అనుకోకుండా మూర్ఛ వచ్చింది. దీంతో మెల్లిగా స్పృహ తప్పి నీటిలో మునిగిపోబోయింది. వెంటనే గమనించిన ఆమె పదేళ్ల కొడుకు గెవిన్, పరుగెత్తుకుంటూ వెళ్లాడు. స్విమ్మింగ్ పూల్‌లోకి ఎక్కి, మునిగిపోతున్న తల్లిని రక్షించాడు. వెంటనే సాయం కోసం అరవగా, బాలుడి తండ్రి కూడా వచ్చాడు. ఇద్దరూ కలిసి సురక్షితంగా ఆమెను బయటకు తీశారు.

Bengaluru: బెంగళూరును ముంచెత్తిన వరదలు.. స్తంభించిన జనజీవనం.. బంద్ ప్రకటించిన ప్రభుత్వం

ఈ ఘటన అంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలుడి సమయస్ఫూర్తిని, సాహసాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అమెరికన్ మీడియా కూడా బాలుడ్ని ప్రశంసిస్తోంది.