China : రోలింగ్ మెషీన్‌లో పడి తృటిలో ప్రాణాలతో బయటపడ్డ మహిళ

ఓ మహిళ తాను పనిచేస్తున్న చోట ప్రమాదవశాత్తు రోలింగ్ మెషీన్ లో పడిపోయింది. మెషీన్ ఆపివేయడంతో అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడింది.

China : రోలింగ్ మెషీన్‌లో పడి తృటిలో ప్రాణాలతో బయటపడ్డ మహిళ

China

China : భూమి మీద నూకలు ఉంటే ఎంత భయంకరమైన ప్రమాదం నుంచి అయినా తప్పించుకోగలుగుతారు. ఓ మహిళ రోలింగ్ మెషీన్‌లో చిక్కుకుంది. యంత్రంలో అనేకసార్లు తిరిగినా ఆమెకు ఏమీ జరగకపోవడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

Himachal Pradesh : జేసీబీపై విరుచుకుపడ్డ భారీ బండరాళ్లు .. ప్రాణాలతో బయటపడ్డ కార్మికులు .. వణుకు పుట్టించిన వీడియో

కొన్ని పరిశ్రమల్లో యంత్రాల దగ్గర పనిచేసే వారు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా వాటిలో పడి ప్రాణాల మీదకు తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. చైనాలో జరిగినట్లుగా చెబుతున్న ఓ సంఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. ఓ మహిళ రోలింగ్ మెషీన్‌లో పడిపోయింది. ఈ మెషీన్లు బట్టల పరిశ్రమ లేదా షీట్ మెటల్ తయారు చేసేటపుడు ఉపయోగిస్టారట. అందులో పడిన మహిళ ఇరుక్కుపోయి అనేకసార్లు తిరుగుతూ కనిపించింది. ప్రమాదాన్ని గుర్తించిన కొందరు వెంటనే మెషీన్ ఆపివేయడంతో అదృష్టవశాత్తూ ఆమె తీవ్ర గాయాలు కాకుండా ప్రాణాలతో బయటపడింది.

Bihar : యువకుడి పైశాచికత్వం .. ట్రైన్ డోర్ దగ్గర నిలబడి ఎదురుగా వెళ్తున్న ట్రైన్‌లోని ప్రయాణికుల్ని బెల్టుతో కొట్టాడు

ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అయిన తరువాత దానిని తొలగించారు. ‘ప్రమాదకరమైన పరిస్థితి నుంచి మహిళ తప్పించుకోగలిగింది’ అని .. ‘చూస్తుంటే చాలా భయం వేసింది..కానీ అదృష్టవశాత్తూ ఇంజిన్ ఆగిపోయింది’ అంటూ కామెంట్లు చేసారు.