World Food Day : ప్రపంచ ఆహార దినోత్సవం..ప్రధాన లక్ష్యం ఇదే..పాటించాల్సిన బాధ్యత అందరిదీ..

ప్రపంచ ఆహార దినోత్సవం. ప్రపంచ వ్యాప్తంగా ఉండే ప్రజల ఆకలి తీర్చటమే ఈ రోజు లక్ష్యం. కరోనా కంటే క్యాన్సర్ మహమ్మారులకంటే అత్యంత భయంకరమైన దారుణమైనదీ ఆకలి తీర్చే లక్ష్యంగా..

World Food Day : ప్రపంచ ఆహార దినోత్సవం..ప్రధాన లక్ష్యం ఇదే..పాటించాల్సిన బాధ్యత అందరిదీ..

World Food Day (1)

World Food Day 2021: అక్టోబర్ 16. ప్రపంచ ఆహార దినోత్సవం. ఇప్పుడు మనం కరోనా మహమ్మారి. క్యాన్సర్ మహమ్మారి అని చెప్పుకుంటున్నాం. కానీ ‘ఆకలి’ అన్నింటికంటే పెద్ద మహమ్మారికి. ప్రపంచ వ్యాప్తంగా ఉండే అత్యంత పెద్ద మహమ్మారి ఇదే ‘ఆకలి’. మనిషి ఏం చేసినా ఈ ఆకలి తీర్చుకోవటానికే.జానెడు పొట్ట నింపుకోవటానికి కాయకష్టం చేసే కూలీల నుంచి కోట్లకు పడగలెల్లినవారు కూడా ఆకలితో ఏ పని చేయలేదు. ఆ కడుపు నింపుకోవటానికి ఇన్ని పాట్లన్నీ. ఈ ఆకలి అనేది ఆకలి సమస్య పేద దేశాల్లోనే కాదు..ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఆకలి కేకలు వినిపిస్తుండటం గమనించాల్సిన విషయం.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నింటిన్నింటిని సమానత్వంతో చూస్తుంది ఆకలి. మనిషే కాదు. ప్రతీ జీవిని ఆకలి సమానత్వంతోనే చూస్తుంది. పేద గొప్పా తనే తేడా లేదు ఆకలికి. అటువంటి ‘ఆకలి’ తీర్చటానికే ఈ ప్రపంచ ఆహార దినోత్సవం. అది ఈరోజే. మరి ఈ రోజు ఏర్పడటానికి కారణమేంటీ? ప్రపంచ ఆహార దినోత్సం లక్ష్యమేంటీ? దీని సందేశమేంటీ? ఇది ఎలా ప్రారంభమైందో తెలుసుకుందాం..

Read more : World Food Safety Day: తిండి లేక కొందరు.. వృథా చేస్తూ మరికొందరు

ప్రపంచ ఆకలి తీర్చడమే వరల్డ్‌ ఫుడ్‌ డే ప్రధాన లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా 150 కి పైగా దేశాలు ఈ ‘వరల్డ్‌ ఫుడ్‌ డే’కార్యక్రమంలో పాల్గొంటాయి. అందరికీ ఆరోగ్యకరమైన ఆహారం అంటూ ప్రతీ ఏడాది లాగానే ‘‘ఆరోగ్యకరమైన రేపటి కోసం ఇప్పుడు సురక్షితమైన ఆహారం” అనే థీమ్‌ను నిర్ణయించారు. ఆహారాన్ని ఆదా చేయడం, ఆహార వ్యర్థాలను తగ్గించడం, వ్యవసాయం, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల అభివృద్ధిని పెంచడం అనేది ఈ రోజు ప్రధాన లక్ష్యం. భవిష్యత్తు తరాల కోసం ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ప్రబలంగా ఉన్న పోషకాహారలోప సమస్యను నిర్మూలించాలనేది కూడా ఈ వరల్డ్ ఫుడ్ డే ప్రధానన ఉద్దేశం.

Read more : కడుపులు కాలిపోతున్నాయ్:53 దేశాల్లో ఆకలి కేకలు

ప్రపంచ ఆహార దినోత్సవం చరిత్ర..ప్రాధాన్యత
ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఏఓ) 1945లో ప్రారంభించబడింది. అప్పటి నుంచి ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ప్రపంచ దేశాలన్నీ పాటిస్తున్నాయి. 1979 నుండి ప్రతి సంవత్సరం అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఆహారం విలువ ఏంటో చాటి చెప్పటానికే. హంగేరియాకు చెందిన మాజీ వ్యవసాయ, ఆహార మంత్రి డాక్టర్ పాల్ రోమానీ సూచన మేరకు ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా దేశాలు ఈ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.దాదాపు 821 మిలియన్ల ప్రజలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. తద్వారా వీరు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో దాదాపు 99 శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన ప్రజలు కావటం గమనించాల్సిన విషయం. కాగా ఆకలి అంటే అమ్మే గుర్తుకొస్తుంది. అటువంటి అమ్మ తాను ఆకలితో అలమటిస్తున్నా బిడ్డల కడుపు నింపాలనే చూస్తుంది. అటువంటి మహిళలే ఎక్కువగా ఆకలితో బాధపడుతున్నారు. ఏ ఒక్క సమస్య వచ్చినా అది ముందు మహిళలపైనా ప్రభావం పడుతుంది. అలాగే ఈ ఆకలి సమస్య కూడా మహిళలకే ఎక్కువగా గురవతున్నారు.

Read more : India’s GHI Score : ఆకలి సూచీలో పడిపోయిన భారత్ ర్యాంకు..మోదీకి అభినందనలు తెలిపిన కపిల్ సిబల్

ప్రపంచంలో ఆకలితో ఉన్నవారిలో 60శాతం మంది మహిళలే ఉండటం ఈ మాటలకు నిలువెత్తు నిదర్శనాలుగా కనిపిస్తున్నాయి. మహిళలు ఆకలితో ఉంటే ముఖ్యంగా గర్భిణులకు ఇటువంటి సమస్య ఉంటే పుట్టే పిల్లలమీద అది అత్యంత ప్రభావం చూస్తుంది. తద్వారా అనారోగ్య పిల్లలకు జన్మనిచ్చే పరిస్థితి నెలకొంటుంది. అదే జరుగుతోంది. ప్రతి సంవత్సరం దాదాపు 20 మిలియన్ల మంది పిల్లలు తక్కువ బరువుతో పుట్టారనే విషయం దీనికి నిదర్శనం.ఇందులో కూడా 96.5శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉండటం గమనార్హం. వీరిలో ప్రతి ఐదు జననాలలో ఒక బిడ్డ సరైన వైద్య సదుపాయం లేకపోవటం వల్లే ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. దీంతో పిల్లల్లో మరణాలలో 50శాతం మంది 5 సంవత్సరాల లోపే ఉంటున్నాయి. ఎయిడ్స్, మలేరియా, క్షయ వ్యాధుల వల్ల జరిగే మరణాల కంటే..ఆకలి వల్ల జరిగే మరణాల రేటే ఎక్కువగా ఉందనే విషయం అత్యంత ఆందోలన కలిగించే విషయం. ఈ మరణాల స్థాయిలో ఎంతగా ఉందంటే..ప్రతి రోజు, 10,000 మందికి పైగా పిల్లలతో సహా 25,000 మంది ఆకలి, సంబంధిత కారణాలతో మరణిస్తున్నారు.

ఓ పక్క పెరుగుతున్న జనాభా.మరో పక్క తగ్గుతున్న వ్యవసాయం. దీంతో ఆకలి చావులు. ఈక్రమంలో పెరుగుతన్న జనాభా 2050 నాటికి ప్రపంచ జనాభా 9.6 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా. ఈ పరిస్థితుల్లో ఆహార ఉత్పత్తని పెంచడం అంటే తక్కువ ప్రాంతంలో ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేస్తే కొంతలో కొంత ఆహార సంక్షోభాన్ని నివారించవచ్చు. కానీ వ్యవసాయం చేసే పద్ధతులు ముఖ్యంగా సహజ వనరులను ఉపయోగించాలినేది లక్ష్యంగా పెట్టుకున్నా అది జరిగే పరిస్థితులు కనిపించటంలేదు. మెరుగైన పంట, నిల్వ, ప్యాకింగ్, రవాణా, మౌలిక సదుపాయాలు, మార్కెట్ యంత్రాంగాలతో పాటు, సంస్థాగత చట్టపరమైన చర్యలతో అనేక కార్యక్రమాల ద్వారా ఆహార నష్టాలను తగ్గించాలని నిర్ణయాలు జరిగాయి.

Read more :

గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌ లో దిగజారిన ఇండియా..
మరోవైపు గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో ఇండియా మరింత దిగజారింది. ప్రపంచ ఆకలి సూచిక (జీహెచ్‌ఐ) 2021లో 116 దేశాలలో భారతదేశం 101వ స్థానానికి పడి పోయింది. తాజా నివేదిక ప్రకారం 94వ స్థానం 101కి దిగజారింది. మన సరిహద్దు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ , నేపాల్ కంటే కూడా ఇండియా వెనుకబడి ఉందని తెలుస్తోంది. బ్రెజిల్, చిలీ, చైనా. క్యూబా కువైట్ సహా పద్దెనిమిది దేశాలు జీహెచ్‌ఐ స్కోరు తొలి అయిదు టాప్ ర్యాంక్‌లో నిలిచాయని ఆకలి, పోషకాహారలోపాలను లెక్కించే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ వెబ్‌సైట్ గురువారం (అక్టోబర్ 14,2021) వెల్లడించింది.

భారత్ లో ఆకలి సమస్య ఆందోళనకరంగా ఉందని పేర్కొంది. దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి..తద్వారా వచ్చిన లాక్ డౌన్ తో ఎన్నో ఉత్పత్తులు ఆగిపోయాయి.ఈ ప్రభావంతో ప్రజలపై తీవ్రంగా పడింది.ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే పోషహార లోపంతో బాధపడుతున్న పిల్లల సంఖ్య భారత్ లో నే ఎక్కువగా ఉందని ఈ నివేదిక పేర్కొంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 47 ప్రకారం దేశంలో పోషకాహార ప్రమాణాలను కాపాడటం ప్రభుత్వాల విధి. మరి ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు. అలాగే ప్రతీ ఒక్కరు ఆహారాన్ని వ్యర్థం చేయకుండా కాపాడుకోవాల్సిన అవసరంతో పాటు వ్యవసాయానికి అవసరమైన వనరుల్ని కూడా కాపాడుకోవాలి. భావితరాలకు వాటిని అందించాలి. ఇది ప్రతీ ఒక్కరి బాధ్యత అని మర్చిపోకూడదు.