Wuhan lab Covid-19:క‌రోనా వైరస్ పుట్టింది ఉహాన్ ల్యాబ్‌లోనే..పార్ల‌మెంట్ కు తెలిపిన కెన‌డా శాస్త్ర‌వేత్త‌ డా.అలీనా చాన్

క‌రోనా పుట్టింది ఉహాన్ ల్యాబ్‌లోనే..పార్ల‌మెంట్ కమిటీకి కెన‌డా శాస్త్ర‌వేత్త‌ డా.అలీనా చాన్ స్పష్టంచేశారు.

Wuhan lab Covid-19:క‌రోనా వైరస్ పుట్టింది ఉహాన్ ల్యాబ్‌లోనే..పార్ల‌మెంట్ కు తెలిపిన కెన‌డా శాస్త్ర‌వేత్త‌ డా.అలీనా చాన్

Wuhan Lab Leak Covid 19

Wuhan lab leak Covid-19 : గత రెండేళ్ల నుంచి ప్రపంచాన్ని ప్రశాంతంగా ఉండనివ్వకుండా హడలెత్తిస్తున్న ‘కోవిడ్-19’’ వైరస్ మహమ్మారి పుట్టింది చైనాలోనేనని ప్రపంచమంతా ఆరోపిస్తోంది. కానీ చైనా మాత్రం వీటిని ఖండిస్తోంది. కానీ కోవిడ్ పుట్టింది చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచేనని అది ప్రపంచానికి వ్యాప్తి చెందింది అక్కడినుంచేనని ఓ జ‌న్యు శాస్త్ర‌వేత్త స్పష్టంచేశారు..! కెన‌డాకు చెందిన జీవ‌క‌ణ శాస్త్ర‌వేత్త..కెనడాకు చెందిన మాలిక్యులరర్ బయాలజిస్టు డాక్ట‌ర్ అలీనా చాన్ బుధవారం (డిసెంబర్ 15,2021) ఈ విష‌యాన్ని ద్రువీక‌రించారు..!!

Read more : V-Sat 2022 : విజ్ఞాన్‌ యూనివర్సిటీ డిగ్రీ ప్రోగ్రామ్స్ లో ప్రవేశానికి వీ-శాట్ నోటిఫికేషన్

హౌస్ ఆఫ్ కామన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమిటీలోని పార్లమెంట్ (ఎంపీలు) వైజ్ఞానిక పరిశోధనపై పార్లమెంట్ ప్యానెల్ క్రాస్-పార్టీ సభ్యులతో..డాక్టర్ అలీనా చాన్ ఈ విష‌యాన్ని తెలిపారు. కోవిడ్ మ‌హ‌మ్మారి వుహాన్ ప్రాంతంలో ఉన్న ల్యాబ్ నుంచే పుట్టిందని పార్ల‌మెంట్ క‌మిటీకి వెల్ల‌డించారు. ఉహాన్ వైరాల‌జీ ఇన్స్‌టిట్యూట్‌తో లింకు ఉన్న పూరిన్ క్లీవేజ్ సైట్ నుంచి క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లిన‌ట్లు ఆమె త‌న రిపోర్ట్‌లో తెలిపారు. ప్ర‌స్తుతం ఉన్న ద‌శ‌లో.. కరోనా వైర‌స్ స‌హజంగా పుట్టింద‌ని చెప్ప‌డం క‌న్నా… ఆ ప్రాణాంత‌క వైర‌స్ ల్యాబ్ నుంచే లీకైందని ఆమె పార్ల‌మెంట్ క‌మిటీకి స్ప‌ష్టం చేశారు.

Read more : Women Marriage: అమ్మాయిల పెళ్లి వయసు 18 కాదు.. 21!

హునాన్ సీఫుడ్ మార్కెట్ నుంచి మ‌నుషుల ద్వారా వైర‌స్ వ్యాప్తి చెంది ఉంటుంద‌ని భావిస్తున్నార‌ని..అయితే ఆ మార్కెట్ నుంచి స‌హ‌జ‌సిద్ధంగా వైర‌స్ వ్యాప్తి అయిన‌ట్లు ఎటువంటి ఆధారాలు లేవ‌ని అన్నారామె. ల్యాబ్ నుంచి లీక్ కావ‌డానికి ముందు వైర‌స్‌లో జ‌న్యు మార్పులు చేశారా అని క‌మిటీ అడిగిన ప్ర‌శ్న‌కు ఆమె బ‌దులిస్తూ.. మేటి వైరాజ‌లిస్టులు ఈ విష‌యాన్ని అంగీక‌రిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.