Love Marriage: అబ్బాయికి 16.. ఆమెకి 19.. పెళ్ళైన 6 గంటలకే పెటాకులు!

కొందరి జీవితాలలో సినిమాలకు మించిన ట్విస్టులు చోటుచేసుకుంటుంటాయి. అవి బయటకి చెప్తే అబ్బా చా నిజమా అనుకోని నమ్మడం కూడా సులభంగా కాదు.

Love Marriage: అబ్బాయికి 16.. ఆమెకి 19.. పెళ్ళైన 6 గంటలకే పెటాకులు!

Love Marriage

Love Marriage: కొందరి జీవితాలలో సినిమాలకు మించిన ట్విస్టులు చోటుచేసుకుంటుంటాయి. అవి బయటకి చెప్తే అబ్బా చా నిజమా అనుకోని నమ్మడం కూడా సులభంగా కాదు. కానీ, అనుభవించే వారికి తెలుస్తుంది అది ఎంత నిజమో. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా క్షణానికో ట్విస్ట్ తిరిగే థ్రిల్లింగ్ సినిమా లాంటిదే. అబ్బాయి వయసు 16 ఏళ్ళు కాగా అమ్మాయికి 19. తనకంటే మూడేళ్లు చిన్నవాడిని పెళ్లి చేసుకోగా పెళ్ళైన 6 గంటలకి ఆ పెళ్లి పెటాకులైంది.

అయితే, ఈ పెళ్లి వెనుక కూడా మరో భారీ ట్విస్ట్ ఉంది. ఝార్ఖండ్ మఝాగవాలో ఈ ట్విస్టుల పెళ్లి జరిగింది. 16 ఏళ్ల యువకుడు 19 ఏళ్ల యువతీ ప్రేమించుకుంటున్నారు. ఓరోజు అర్ధరాత్రి సమయంలో ఆ యువకుడు అమ్మాయిని కలిసేందుకు గోడదూకి ఆమె ఇంటిలోకి వెళ్ళాడు. అది గమనించిన చుట్టుపక్కల వాళ్లు అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పడంతో దొంగగా భావించి అందరూ కలిసి అతన్ని చితకబాదారు.

దెబ్బలు తిన్న తర్వాత తాను దొంగను కాదు మొర్రో మీ అమ్మాయిని పేమించిన ప్రేమికుడిని అని చెప్పడంతో అందరూ విస్తుపోయారు. సరే జరిగిందేదో జరిగిపోయింది.. ఎలాగు పరువు కూడా పోయింది.. ఇద్దరికీ పెళ్లి చేస్తే కొంతైనా పరువు దక్కుతుందని భావించిన తల్లిదండ్రులు ఇద్దరికీ పెళ్లి చేశారు. కానీ, ఇంతలో పోలీసులు రంగప్రవేశం చేసి మైనర్ బాలుడికి పెళ్లి ఎలా చేస్తారని అందరినీ కూర్చోబెట్టి కౌన్సెలింగ్ ఇచ్చి ఆ పెళ్లి తూచ్ అనేశారు. మొత్తానికి మూడు రోజులు ట్విస్టుల మీద ట్విస్టుల మధ్య జరిగిన పెళ్లి ఆరు గంటలలో పెటాకులు అయిపొయింది.