Nagarjuna : ‘సోగ్గాడే చిన్ని నాయనా’లో 6గురు.. ‘బంగార్రాజు’ సినిమాలో 8మంది హీరోయిన్స్

'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాలో రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి మెయిన్ హీరోయిన్స్ కాగా.. అనుష్క శెట్టి, అనసూయ, దీక్షా పంత్, హంసా నందిని కూడా నటించారు. ఇక ఇప్పుడు 'బంగార్రాజు'..........

Nagarjuna : ‘సోగ్గాడే చిన్ని నాయనా’లో 6గురు.. ‘బంగార్రాజు’ సినిమాలో 8మంది హీరోయిన్స్

Bangarraju (1)

Bangarraju :  తెలుగు ఇండస్ట్రీలో మన్మథుడు అంటే నాగార్జుననే. ఆ టైటిల్ తో సినిమా కూడా తీసేశాడు. 60 ఏళ్లు దాటినా ఇప్పటికీ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే నాగార్జునకి. ఇక తన సినిమాల్లో ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ ని పరిచయం చేశాడు. ఒక్కో సినిమాలో చాలా మంది హీరోయిన్స్ ని కూడా యాక్ట్ చేయిస్తాడు. గతంలో ‘కింగ్’ సినిమాలో ఒక పాట కోసం ఏకంగా ఇండస్ట్రీలో ఉన్న లీడింగ్ హీరోయిన్స్ అందరినీ తీసుకొచ్చాడు నాగార్జున. ప్రస్తుతం నాగార్జున ‘బంగార్రాజు’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

Ramesh Babu : అన్న రమేశ్ బాబు కడసారి చూపుకు మహేశ్ బాబు దూరం..!

అయితే ఈ సినిమాలో కూడా ఎక్కువ మంది హీరోయిన్స్ ని నటింపచేశాడు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి మెయిన్ హీరోయిన్స్ కాగా.. అనుష్క శెట్టి, అనసూయ, దీక్షా పంత్, హంసా నందిని కూడా నటించారు. ఇక ఇప్పుడు ‘బంగార్రాజు’ సినిమాలో ఏకంగా 8 మంది భామలని తీసుకొస్తున్నారట. ఇందులో కూడా రమ్యకృష్ణ, కృతి శెట్టి మెయిన్ హీరోయిన్స్ కాగా.. జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా ఐటమ్ సాంగ్ చేసింది. వీళ్ళతో పాటు మీనాక్షి దీక్షిత్, దర్శన బానిక్, వేదిక, దక్ష నాగర్కర్, సిమ్రత్ కౌర్ లు కూడా ‘బంగార్రాజు’ సినిమాలో కనిపించబోతున్నారు. ఒకే సినిమాలో ఎనిమిది మంది హీరోయిన్స్ అంటే మామూలు విషయం కాదు. మరోసారి ఈ సినిమాతో ఇంతమంది హీరోయిన్స్ ని తీసుకొచ్చి నాగార్జున మన్మధుడు అని ప్రూవ్ చేసుకున్నాడు. మరి ఇంతమంది హీరోయిన్స్ సినిమాలో ఏ రేంజ్ లో మెప్పించారో చూడాలి.