Manike Mage Hithe: వైరల్.. ‘మానికే మాగే’ పాటను తునాతునకలు చేసి పాడేశాడు!

ఈ మధ్య కాలంలో టిక్‌టాక్.. యూట్యూబ్ షార్ట్స్.. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్.. ఇలా ఎక్కడ చూసినా ఈ అమ్మాయి పాటే. హస్కీ వాయిస్‌తో వినేకొద్ది వినాలనిపించేలా ఆమె పాడిన పాట.. ఖండాలను సైతం..

Manike Mage Hithe: ఈ మధ్య కాలంలో టిక్‌టాక్.. యూట్యూబ్ షార్ట్స్.. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్.. ఇలా ఎక్కడ చూసినా ఈ అమ్మాయి పాటే. హస్కీ వాయిస్‌తో వినేకొద్ది వినాలనిపించేలా ఆమె పాడిన పాట.. ఖండాలను సైతం దాటేసి, సంగీతానికి సరిహద్దులు ఉండవని నిరూపించింది. ‘మణికే మాగే హితే’ అంటూ సాగే ఈ పాటలోని భావం ఎవరికీ అర్థం కాకపోయినా.. ఆమె గాత్రంలోని మాధూర్యం మాత్రం ప్రతి ఒక్కరినీ కట్టిపడేసి బాషలతో సంబంధం లేకుండా.. ప్రపంచాన్ని చుట్టేసింది.

Ketika Sharma: క్యూ కడుతున్న ఆఫర్లు.. ‘టాక్‌ ఆఫ్‌ ది టాలీవుడ్‌’గా కేతికా!

అప్పటి వరకు శ్రీలంకకు పరిమితమైన ఆమె స్టార్ స్టేటస్ ఇప్పుడు హద్దులు దాటేస్తే.. రోజూ రకరకాల భాషల్లో.. వేర్వేరు ర్యాప్‌లతో ఈ సాంగ్ వెర్షన్లు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఒక్క వెర్షన్లు, ర్యాప్ లే కాదు.. సోషల్ మీడియా స్టార్లు ఈ పాటని బేస్ చేసుకొని షార్ట్ వీడియోలు చేస్తుంటే.. మరికొందరు ఈ పాటను సామాన్య ప్రజలు పడుతుంటే రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అలా ఓ వ్యక్తి ఈ పాటను పడుతుంటే మరొకరు రికార్డ్ చేసి ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. అయితే.. ఈ పాట వింటే యోహాని ఫ్యాన్స్ ఆగ్రహాం కట్టలు తెంచుకోవడం గ్యారంటీ.

Venkatesh: ఎఫ్ 3 టీమ్‌కి వెంకీ మామ స్పెషల్ ట్రీట్..!

ఒకవైపు పాట వింటూనే పాట పాడడం ప్రారంభించిన అతను పాట ప్రారంభమైనప్పుడు లిప్‌ మూమెంట్‌ ఇస్తూ చివరకు పాటలో పదాలు అర్థం కాక పిచ్చిపిచ్చిగా పాడేశాడు.. కాదు కాదు పిచ్చి వాగుడు వాగేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ గిద్దా పోస్టు చేయగా.. దీనిని చూసిన నెటిజన్లు తమ నవ్వును ఆపుకోలేకపోతున్నారు. మరికొందరు ఈ పాటతో యోహాని అభిమానులుగా మారిపోయిన వారు ఈ వీడియో చూసి ఆ పిచ్చి కూతలు ఏంట్రా కనిపిస్తే చంపేస్తాం అనేంతగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు