Elephant viral video : నేనుండగా.. నిన్ను పోనిస్తానా.. తల్లి ప్రేమంటే అట్లుంటది మరి..

బిడ్డకు ఆపదొస్తుందంటే చాలు ఆ బిడ్డను కాపాడుకొనేందుకు తల్లి ఎంతకైనా పోరాడుతుంది. తల్లి ప్రేమకు అవధులు ఉండవు.. ఆ ప్రేమ ఆకాశమంత.. అది మనుషుల్లోనైనా, జంతువుల్లోనైనా..

Elephant viral video : నేనుండగా.. నిన్ను పోనిస్తానా.. తల్లి ప్రేమంటే అట్లుంటది మరి..

Mothar Elephant

Elephant viral video: బిడ్డకు ఆపదొస్తుందంటే చాలు ఆ బిడ్డను కాపాడుకొనేందుకు తల్లి ఎంతకైనా పోరాడుతుంది. తల్లి ప్రేమకు అవధులు ఉండవు.. ఆ ప్రేమ ఆకాశమంత.. అది మనుషుల్లోనైనా, జంతువుల్లోనైనా.. తాజాగా ఇదే విషయాన్ని రుజువు చేసింది ఓ తల్లి ఏనుగు. నీటిలో కొట్టుకుపోతున్న ఏనుగు పిల్లను కాపాడేందుకు విశ్వప్రయత్నం చేసింది. చివరికి ఒడ్డుకు చేర్చి ఊపిరిపీల్చుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను వీక్షించిన నెటిజర్లు ధట్స్ మదర్ లవ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ నెటిజర్ నీటి ప్రవాహంలో కొట్టుకు పోతున్న ఏనుగు పిల్లను కాపాడుతున్న తల్లి ఏనుగు వీడియో ను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఓ ఏనుగుల గుంపు కాల్వను దాటుతుంది. ఈ క్రమంలో పిల్ల ఏనుగు నీటి ప్రవాహం ఉధృతికి ఆగలేక కొట్టుకు పోతుంది. దీనిని గమనించిన తల్లి ఏనుగు తన తొండంతో ఏనుగు పిల్లను అడ్డుకొనే ప్రయత్నం చేసింది. అలా రెండుమూడు సార్లు ప్రయత్నించినా నీటి ప్రవాహానికి ఏనుగు పిల్ల నిలబడలేక పోయింది. తన శాయశక్తుల ప్రయత్నించి చివరికు తన బిడ్డను తల్లి ఏనుగు ఒడ్డుకు చేర్చింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వారం రోజుల క్రితం పోస్టు చేసిన ఈ వీడియోను సుమారు రెండు లక్షల మంది వీక్షించారు. ఈ వీడియోకు ఫిధా అయిన నెటిజర్లు కామెంట్లతో తల్లి ఏనుగుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మనుషుల్లోనైనా, జంతువుల్లోనైనా తల్లి ప్రేమ తల్లి ప్రేమే.. అది అనంతం.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.