Ira Khan : అమ్మా నాన్న‌ల విడాకులు.. రోజులో 8 గంట‌లు ఏడుపు..10 గంట‌లు నిద్ర‌.. మందులు మానేశా.. ఏడాదిన్నరపాటు డిప్రెషన్‌

బాలీవుడ్ మిస్ట‌ర్ ఫ‌ర్‌పెక్ట్ ఆమిర్ ఖాన్(Ameer Khan) గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. 1986లో రీనా ద‌త్తా(Reena Dutta)ను పెళ్లి చేసుకున్నాడు. 2002లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. వాళ్లు విడాకులు తీసుకున్న‌ప్పుడు తాను మాన‌సికంగా ఎంత‌గానో కుంగిపోయిన‌ట్లు వాళ్ల కూతురు ఐరా ఖాన్ తెలిపింది.

Ira Khan : అమ్మా నాన్న‌ల విడాకులు.. రోజులో 8 గంట‌లు ఏడుపు..10 గంట‌లు నిద్ర‌.. మందులు మానేశా.. ఏడాదిన్నరపాటు డిప్రెషన్‌

Aamir Khans Daughter Ira Khan

Ameer Khan Daughter Ira Khan : బాలీవుడ్ మిస్ట‌ర్ ఫ‌ర్‌పెక్ట్ ఆమిర్ ఖాన్(Ameer Khan) గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. 1986లో రీనా ద‌త్తా(Reena Dutta)ను పెళ్లి చేసుకున్నాడు. 2002లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఆ త‌రువాత 2005లో కిర‌ణ్ రావు(Kiran Rao)ను పెళ్లాడాడు. 15 ఏళ్ల పాటు క‌లిసి ఉన్న ఈ జంట 2021లో విడిపోయింది. ప్ర‌స్తుతానికి 58 ఏళ్ల ఆమీర్ ఖాన్ ఒంట‌రిగానే ఉంటున్నాడు. అయితే.. ఆమిర్ ఖాన్ మొద‌టి సారి విడాకులు తీసుకున్న‌ప్పుడు తాను మాన‌సికంగా ఎంత‌గానో కుంగిపోయిన‌ట్లు వాళ్ల కూతురు ఐరా ఖాన్ తెలిపింది. ఒక ర‌క‌మైన డిప్రెష‌న్‌లోకి వెళ్లిపోయిన‌ట్లు చెప్పుకొచ్చింది.

ఇటీవ‌ల ఐరా ఖాన్ మాన‌సిక ఆరోగ్యాన్ని అందించ‌డమే ల‌క్ష్యంగా అగత్సు అనే సంస్థ‌ను ప్రారంభించింది. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ తన జీవితంలో చోటు చేసుకున్న సంఘ‌ట‌న‌లను వివ‌రించింది. తాను కూడా మాన‌సికంగా ఎంతో కుంగిపోయిన‌ట్లు చెప్పుకొచ్చింది.

Mukku Avinash : శుభ‌వార్త చెప్పిన అవినాష్‌.. ఇద్ద‌రు ముగ్గురు అయ్యే వేళ‌.. బేబీ గుండె చ‌ప్పుడు విన్న‌ప్పుడు..

‘అమ్మా నాన్న‌లు విడిపోతున్నార‌ని తెలిసిన‌ప్పుడు విదేశాల్లో ఉన్నాను. వెంట‌నే ఇండియాకు వ‌చ్చేశాను. కాగా.. వాళ్లిద్ద‌రు ఇష్ట‌పూర్తిగానే విడిపోతున్నార‌ని తెలిసినా కూడా ఏదో తెలియ‌ని బాధ మ‌న‌సులో నెల‌కొంది. నాలుగు రోజుల పాటు అన్నం కూడా తిన‌లేదు. ఇంకా రోజులో ఎనిమిది గంట‌లు ఏడ్చేదాన్ని, ప‌ది గంట‌లు నిద్ర‌పోతుండే దాన్ని. దాదాపు ఏడాదిన్న‌ర‌పాటు ఇలాగే ఉన్నాను. అయితే.. ఈ విష‌యాన్ని ఎవ్వ‌రికి చెప్ప‌లేదు. ఎందుకంటే చెప్పి వాళ్ల‌ను బాధ‌పెట్ట‌డం నాకు ఇష్టం లేదు.’ అని ఐరా అంది.

తన కుటుంబంలోని కొంతమంది మానసిక రుగ్మతలతో బాధ‌ప‌డుతున్నార‌ని చెప్పుకొచ్చింది. అందుక‌ని తాను కూడా చిన్న స‌మ‌స్య‌ను త‌ట్టుకోలేక డిప్రెష‌న్‌కు వెళ్లిన‌ట్లు తెలిపింది. ఎంత ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికి ప్ర‌తి 8-10 నెల‌ల‌కు ఒక‌సారి మాన‌సికంగా కుంగిపోతుండేదానంది. ఇంకా గ‌తేడాది జూలైలో తీవ్ర మాన‌సికి ఒత్తికి గురైన‌ట్లు, ఆ స‌మ‌యంలో మందులు తీసుకోవ‌డం మానేయ‌డంతో విప‌రీతంగా బ‌రువు పెరిగిన‌ట్లు తెలిపింది. ఆ త‌రువాత డిప్రెష‌న్ పై పోరాల‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని, అందుకు త‌న‌ను తాను స‌న్న‌ద్దం చేసుకున్న‌ట్లు వివ‌రించింది. ప్ర‌స్తుతానికి అంతా బాగానే ఉంద‌ని ఐరా తెలిపింది.

Project K T-shirt : ‘ప్రాజెక్ట్ K’ టీ ష‌ర్ట్ కావాలా.. అయితే ఇలా చేయండి