Acharya : మెగా ప్రీ రిలీజ్ ఈవెంట్..

ఇవాళ ఆచార్య సినిమాకి సంబంధించి మెగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఇవాళ (ఏప్రిల్ 23న) సాయంత్రం హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఆచార్య ప్రి రిలీజ్.............

Acharya : మెగా ప్రీ రిలీజ్ ఈవెంట్..

Acharya

Acharya :  మెగాస్టార్ చిరంజీవి, చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ సినిమా ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవ్వనుంది. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య సినిమా తెరకెక్కింది. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్ లుగా నటించారు. మణిశర్మ సంగీతం అందించగా కొణిదెల ప్రొడక్షన్స్, మాట్ని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు.

Ram Charan: జవాన్ల త్యాగాన్ని మరవద్దు – చరణ్

ఇక ఇవాళ ఆచార్య సినిమాకి సంబంధించి మెగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఇవాళ (ఏప్రిల్ 23న) సాయంత్రం హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఆచార్య ప్రి రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్ కి మెగా అభిమానులు భారీగా హాజరుకానున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి లాహే లాహె, నీలాంబరి, సానా కష్టం, భలే భలే బంజారా లిరికల్ సాంగ్స్, టీజర్, ట్రైలర్ రిలీజ్ అయి భారీ స్పందన తెచ్చుకున్నాయి. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ఆచార్య సినిమా తెరకెక్కింది. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ ఎవరు వస్తారనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంచారు.