Acharya : మెగా సక్సెస్ సెలబ్రేషన్స్..

తండ్రి కొడుకులని స్క్రీన్ మీద ఒకే సారి చూసి మెగా అభిమానులు, ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని థియేటర్ల వద్ద మెగా అభిమానులు ఉదయం నుంచి............

Acharya : మెగా సక్సెస్ సెలబ్రేషన్స్..

Acharya

 

Acharya :  మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా ఇవాళ ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఉదయం ఆట నుంచే పాజిటివ్ టాక్ ని అందుకొని సక్సెస్ గా దూసుకుపోతుంది ఈ సినిమా. తండ్రి కొడుకులని స్క్రీన్ మీద ఒకే సారి చూసి మెగా అభిమానులు, ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని థియేటర్ల వద్ద మెగా అభిమానులు ఉదయం నుంచి సందడి చేశారు. మెగాస్టార్, మెగా పవర్ స్టార్ కి బ్యానర్లు కట్టి, పాలాభిషేకాలు చేసి, టపాసులు పేలుస్తూ, డప్పులతో హంగామా చేశారు.

Aamir Khan : మేకప్‌మెన్‌గా మారిన బాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరికోసమో తెలుసా??

ఇక సినిమాకి పాజిటివ్ టాక్ రావడం, మంచి సక్సెస్ అందుకోవడంతో సాయంత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. మెగా అభిమానులంతా చిరంజీవి ఇంటి వద్ద మెగా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. కేక్ కట్ చేసి, టపాసులు కాల్చి, డప్పులు కొడుతూ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేశారు మెగా అభిమానులు. ఇక కొణిదెల ప్రొడక్షన్ ఆఫీస్ లో డైరెక్టర్స్ అంతా కలిసి ఆచార్య సక్సెస్ సెలబ్రేషన్స్ ని నిర్వహించారు. ఈ సెలబ్రేషన్స్ లో కొరటాల శివ, సుకుమార్, హరీష్ శంకర్, వెంకీ కుడుములతో పాటు మరికొంతమంది పాల్గొన్నారు.