Puneeth Rajkumar : మేమిద్దరం అమ్మ కడుపులో ఉండగానే కలుసుకున్నాం.. ఎమోషనల్ అయిన సూర్య

తమిళ స్టార్ హీరో సూర్య, పునీత్ రాజ్ కుమార్‌కు నివాళులు అర్పించారు..

Puneeth Rajkumar : మేమిద్దరం అమ్మ కడుపులో ఉండగానే కలుసుకున్నాం.. ఎమోషనల్ అయిన సూర్య

Suriya

Puneeth Rajkumar: కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ చిన్న కుమారుడు, కరునాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్ సోదరుడు.. పవర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇకలేరు అనే మాట నమ్మబుద్ధి కావడం లేదు. పునీత్ మరణంతో షాక్‌కి గురై అభిమానులు గుండె పోటుతో మరణించడం బాధాకరం. గురువారం నాడు కంఠీరవ స్టూడియోలోని పునీత్ రాజ్ కుమార్ సమాధిని సందర్శించి నివాళులు అర్పించడానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు.

Puneeth Rajkumar : వయసులో చిన్న.. వ్యక్తిత్వంలో మిన్న.. తండ్రిలానే కళ్లు దానం చేసిన పునీత్ రాజ్ కుమార్..

పునీత్‌ను చివరిసారి చూడలేక పోయిన నాగార్జున, రామ్ చరణ్ వంటి పలువురు టాలీవుడ్ ప్రముఖులు బెంగుళూరులోని ఆయన నివాసానికి చేరుకుని నివాళులు అర్పిస్తున్నారు. పునీత్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. శుక్రవారం నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్, పునీత్ నివాసానికి వెళ్లారు. పునీత్ రాజ్ కుమార్‌కి నివాళులు అర్పించారు.

Puneeth Rajkumar : చెప్పులు విడిచి నివాళి… పునీత్ అభిమానుల ప్రేమకు సలాం..

కోలీవుడ్ నుండి శివ కార్తికేయన్ కూడా, పునీత్‌కి నివాళులు అర్పించి శివ రాజ్ కుమార్‌ని పరామర్శించారు. రీసెంట్‌గా వెర్సటైల్ యాక్టర్ సూర్య బెంగుళూరు వెళ్లారు. కంఠీరవ స్టూడియోలోని పునీత్ సమాధిని సందర్శించారు. పునీత్ రాజ్ కుమార్‌కి నివాళులు అర్పించారు. ఆయన వెంట శివ రాజ్ కుమార్ కూడా ఉన్నారు. అనంతరం సూర్య మీడియాతో మాట్లాడారు.

Puneeth Rajkumar : పునీత్ కుటుంబం ఈ బాధ నుండి త్వరగా కోలుకోవాలి – రాజేంద్ర ప్రసాద్

‘మా ఇరు కుటుంబాల మధ్య మంచి స్నేహ బంధం ఉంది. మా నాన్న గారు ఎప్పుడూ రాజ్ కుమార్ గారి ఫ్యామిలీ గురించి చెప్తుండేవారు. మా అమ్మ గారు, పునీత్ రాజ్ కుమార్ అమ్మ పార్వతమ్మ గారు మొట్టమొదటి సారి గర్భిణులుగా ఉన్నప్పుడే కలుసుకున్నారట. అలా అమ్మ కడుపులో ఉండగానే మేవిద్దరం కలుసుకున్నాం. పునీత్ ఇక లేడనే వార్తను నేను, వాళ్ల కుటుంబ సభ్యులు కూడా ఇంకా జీర్ణించుకోలేక పోతున్నాం’ అన్నారు.