Vadivelu : కరోనా బారినపడ్డ వడివేలు

ప్రముఖ తమిళ నటుడు, పాపులర్ కమెడియన్ వడివేలు కరోనా బారినపడ్డారు..

Vadivelu : కరోనా బారినపడ్డ వడివేలు

Vadivelu

Updated On : December 24, 2021 / 4:16 PM IST

Vadivelu: కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుందనుకుంటే మెల్లగా మళ్లీ పంజా విసురుతోంది. రెండుసార్లు లాక్‌డౌన్, అస్థవ్యస్థమైన జనజీవనం, లక్షల్లో కోల్పోయిన ప్రాణాలు.. కోవిడి మిగిల్చిన విషాదం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామనుకుంటే సీన్ రివర్స్ అయ్యింది.

Atrangi Re : టాక్ సూపర్‌హిట్.. కానీ అదొక్కటే మైనస్..

తాజాగా ప్రముఖ తమిళ నటుడు, పాపులర్ కమెడియన్ వడివేలు కరోనా బారినపడ్డారు. స్వల్ప అస్వస్థత కారణంగా నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ప్రస్తుతం వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు వడివేలు.

Arjuna Phalguna : ట్రైలర్‌లో జూనియర్ ఎన్టీఆర్‌ని బాగానే వాడారుగా..

ఇటీవల విశ్వనటుడు కమల్ హాసన్ కరోనా బారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వడివేలుకి కరోనా సోకిందనే వార్తతో కోలీవుడ్ ఇండస్ట్రీలో అలజడి రేగింది. ఆయన త్వరగా కోలుకోవాలంటూ పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

Bigg Boss 6 Telugu : నాగార్జున సరికొత్త ప్రయోగం.. 24 గంటల పాటు లైవ్!