Tamannaah Bhatia : అరిటాకులో భోజనం.. దేవతలా మారిన తమన్నా..
లంచ్ బ్రేక్‌లో తమన్నా షేర్ చేసిన పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి..

Tamannaah Bhatia
Tamannaah Bhatia: మిల్కీబ్యూటీ తమన్నా పాండమిక్ తర్వాత ‘సీటీమార్’ తో సాలిడ్ హిట్ కొట్టింది. నితిన్‌తో నటించిన ‘అందాధూన్’ రీమేక్ ‘మ్యాస్ట్రో’ ఓటీటీలో విడుదలైంది. ఇక ‘ఆహా’ లో ‘లెవంత్ అవర్’ సిరీస్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ‘మాస్టర్ చెఫ్’ తో బుల్లితెర ఎంట్రీ ఇచ్చి.. కొద్దిరోజులకే వెనుదిరిగింది.
Master Chef : తమన్నా వల్ల తడిసి మోపెడైందంట!
ప్రస్తుతం ‘ఎఫ్ 2’ సీక్వెల్ ‘ఎఫ్ 3’, తో పాటు మెగాస్టార్ చిరంజీవి పక్కన ‘భోళాశంకర్’ మూవీలో నటిస్తోంది. ‘సైరా’ తర్వాత చిరుతో రెండోసారి నటిస్తోంది తమన్నా. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటికే ఓ సాంగ్ షూట్ చేసేశారు. ప్రస్తుతం ఫైట్ చిత్రీకరణ జరుగుతోంది.
Tamannaah Bhatia : టైలర్‌గా మారిన తమన్నా..
రీసెంట్‌గా షూటింగ్ స్పాట్ నుండి లంచ్ బ్రేక్‌లో తమన్నా షేర్ చేసిన పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ‘100% లవ్’ లో దటీజ్ మహాలక్ష్మీగా అలరించిన మిల్కీబ్యూటీ మహాలక్ష్మీ అవతారంలో అరిటాకులో భోజనం చేస్తుంది. అరిటాకులో భోజనం చేసేటప్పుడు దేవతలా ఫీలవుతానంటూ భలే కామెంట్స్ చేసింది తమన్నా.
View this post on Instagram