Adipurush : రిలీజ్ కి ముందే ఆదిపురుష్ 400 కోట్ల బిజినెస్ చేసేసిందిగా.. ఈ లెక్కన చూస్తే కలెక్షన్స్..

ఆదిపురుష్ కి సంబందించి ఇప్పటికే బిజినెస్ సాలిడ్ గా జరిగిపోయింది. హైప్ పెద్దగా లేకపోయినా ప్రభాస్ ఫస్ట్ టైమ్ రాముడిగా కనిపిస్తున్న సినిమా కాబట్టి ఓపెనింగ్ డేనే మినిమం 100కోట్లు రాబడుతుందని అంచనాలు వేస్తున్నారు.

Adipurush : రిలీజ్ కి ముందే ఆదిపురుష్ 400 కోట్ల బిజినెస్ చేసేసిందిగా.. ఈ లెక్కన చూస్తే కలెక్షన్స్..

Adipurush Pre Release Event Business Cross 400 Crores and increase expectations

Adipurush :  ప్రభాస్(Prabhas) సినిమా అంటే అన్నీ నెక్ట్స్ లెవల్ లోనే ఉంటాయి. బడ్జెట్ దగ్గరనుంచి ప్రభాస్ తీసుకునే రెమ్యూనరేషన్ వరకూ అంతా వందల కోట్లలోనే లెక్క. మరి వీటికే ఇన్నికోట్లు ఖర్చు పెడితే ఆదిపురుష్ ఏ రేంజ్ లో డబ్బులు రాబట్టాలి..? అసలే 600కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆదిపురుష్ కి రావల్సినంత క్రేజ్, హైప్ రావడం లేదని వర్రీ అవుతున్నారు ఫ్యాన్స్. కానీ అసలు ఆదిపురుష్ బడ్జెట్ లో మూడోవంతు డబ్బు రిలీజ్ కి ముందే వచ్చేసిందని సమాచారం.

ఆదిపురుష్ కి సంబందించి ఇప్పటికే బిజినెస్ సాలిడ్ గా జరిగిపోయింది. హైప్ పెద్దగా లేకపోయినా ప్రభాస్ ఫస్ట్ టైమ్ రాముడిగా కనిపిస్తున్న సినిమా కాబట్టి ఓపెనింగ్ డేనే మినిమం 100కోట్లు రాబడుతుందని అంచనాలు వేస్తున్నారు. ఇక వీకెండ్ రెండు రోజులు ఇంకో 200 కోట్ల కలెక్షన్స్ కూడా వచ్చేస్తాయని భావిస్తున్నారు. ఈ లెక్కన చూస్తే ఆదిపురుష్ లాభాల బాట కచ్చితంగా పడుతుంది అని అంటున్నారు సినీ ట్రేడ్ వర్గాలు.

ఆదిపురుష్ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ కింద 200 కోట్ల బిజినెస్ జరిగినట్టు సమాచారం. శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్, డిజిటల్ రైట్స్ ఇలా నాన్ థియేట్రికల్ రైట్స్ అన్నీ కలిపే ఇప్పటికే 250 కోట్లు వచ్చేశాయని తెలుస్తోంది. ఇక థియేట్రికల్ రైట్స్ తెలుగులోనే 150 కోట్లకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ కొనేసినట్లు ఇటీవల ఆ సంస్థ నిర్మాత తెలిపారు. ఇక వేరే అని భాషల్లో కలిపి ఇంకో 100 కోట్లకు పైగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం. ఈ లెక్కన సినిమా రిలీజ్ కి ముందే 400 కోట్లకు పైగానే బిజినెస్ అయిందని తెలుస్తోంది. హిందీలో ఓన్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ లెక్కన కలెక్షన్స్ బాగా వస్తే నిర్మాతలకు ఫుల్ లాభాలే. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల కలెక్షన్స్ టార్గెట్ గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది.

Adipurush : ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం.. ముంబై నుంచి తిరుపతికి బైక్‌పై ఆదిపురుష్ మ్యూజిక్ డైరెక్టర్..

ప్రభాస్(Prabhas) రాముడిగా, కృతి సనన్(Kriti Sanon) సీతగా, సైఫ్ అలీఖాన్(Saif Alikhan) రావణాసురుడిగా ఓం రౌత్(Om Raut) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఆదిపురుష్ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. జూన్ 6న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తిరుపతిలో భారీగా నిర్వహించబోతున్నారు.