Hit 2 : హిట్ 2 రివ్యూ.. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. థియేటర్స్‌లోనే చూడాలి..

నాని నిర్మాతగా శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన హిట్ 2 సినిమా నేడు రిలీజయింది. అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా కోమలీ ప్రసాద్, రావు రమేష్, తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలు పోషించారు. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ అంశాలతో..............

Hit 2 : హిట్ 2 రివ్యూ.. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. థియేటర్స్‌లోనే చూడాలి..

adivi sesh hit 2 movie review

Hit 2 :  నాని నిర్మాతగా శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన హిట్ 2 సినిమా నేడు రిలీజయింది. అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా కోమలీ ప్రసాద్, రావు రమేష్, తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలు పోషించారు. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కిన హిట్ 2 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మార్నింగ్ షోలు అయిపోయి అన్ని చోట్లా సినిమాకి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.

కథ పరంగా.. హీరో ఒక పోలీస్ ఆఫీసర్. ఎలాంటి క్రిటికల్ కేసునైనా డీల్ చేస్తాడు. అలాంటి ఆఫీసర్ కి ఒక అమ్మాయిని చంపి ముక్కలు చేశారు అనే కేసు వస్తుంది. కిల్లర్ ని చాలా సింపుల్ గా పట్టుకుంటాను అని మీడియా ముందు ఛాలెంజ్ చేస్తాడు. అయితే అది అంత ఈజీ కాదు. అంతలో ముక్కలుగా చేసిన ఆ బాడీ దగ్గర ఉన్న ఒక్కో పార్ట్ ఒక్కొక్కరిది అని, సీరియల్ కిల్లర్ అని తెలియడంతో అంతా షాక్ అవుతారు. మరి ఆ కిల్లర్ ని ఎలా పట్టుకున్నాడు హీరో? ఆ కిల్లర్ ఎవరు? హీరోయిన్ తో ప్రేమ సన్నివేశాలు ఎలా ఉంటాయి? ఇన్వెస్టిగేషన్ ఎలా సాగింది అనేది తెరపై చూడాల్సిందే.

ముందునుంచి చిత్ర యూనిట్ చెప్పినట్టే.. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాగా అందర్నీ ఆకట్టుకుంది. మొదటి హాఫ్ అక్కడక్కడా కొంచెం స్లోగా అనిపించినా ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోతుంది. అనంతరం సెకండ్ హాఫ్ ఫైట్స్, ఇన్వెస్టిగేషన్ తో ఫాస్ట్ గా వెళ్తుంది సినిమా. చివర్లో వచ్చే క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోద్ది. ఇక చివర్లో హిట్ 3 హీరో ఎవరో కూడా ఇండైరెక్ట్ గా రివీల్ చేశారు.

Adivi Sesh : హిట్ 2 సినిమాలో కిస్ సీన్స్ చేస్తే మా అమ్మ తిట్టింది..

అడివి శేష్ తన నటనతో అందర్నీ మెప్పించాడు. మీనాక్షి చౌదరి కనిపించిన కాసేపైనా చాలా బాగా చేసింది. శేష్ కి అసిస్టెంట్ గా నటించిన కోమలీ ప్రసాద్ అద్భుతంగా నటించింది. మిగిలిన నటులందరూ కూడా వారి పాత్రలకి న్యాయం చేశారు. విలన్ గా ఎవరు చేశారో చెప్తే స్పాయిల్ అయిపోతుంది కాబట్టి తెర మీద చూసేయండి. ఇక టెక్నీకల్ వ్యాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. మొత్తానికి హిట్ 2తో మరో హిట్ కొట్టాడు డైరెక్టర్ శైలేష్ కొలను. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్స్ నచ్చేవారికి ఈ సినిమా నచ్చుతుంది. దీంతో హిట్ 3 ఎప్పుడువస్తుందా, ఆ సినిమా ఎలా ఉంటుందా అని ఇప్పటినుంచే ఇంట్రెస్ట్ ఏర్పడింది.