Adivi Sesh : నాకు ఆయనలా లవ్ అఫైర్లు లేవు.. కానీ లవ్ లో దెబ్బ తిన్నాను..

ప్రస్తుతం అడివిశేష్ మేజర్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సక్సెస్ లో భాగంగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ, పెళ్లి లాంటి పలు ఆసక్తికర విషయాలు తెలియచేశాడు శేష్‌. అడివి శేష్ పెళ్లి గురించి మాట్లాడుతూ............

Adivi Sesh : నాకు ఆయనలా లవ్ అఫైర్లు లేవు.. కానీ లవ్ లో దెబ్బ తిన్నాను..

Adivi Sesh

Adivi Sesh :  ముంబై ఉగ్రదాడుల్లో పోరాడి వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్‌’. యువ హీరో అడవి శేష్‌ ముఖ్యపాత్రలో శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో ఈ సినిమా రిలీజ్ అయింది. జూన్‌ 3న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాగా విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించి అదిరిపోయే కలెక్షన్స్ కూడా రాబడుతుంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు, సెలబ్రిటీలు అందరూ కూడా మేజర్‌పై, చిత్ర యూనిట్ పై, అడవి శేష్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ప్రస్తుతం అడివిశేష్ మేజర్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సక్సెస్ లో భాగంగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ, పెళ్లి లాంటి పలు ఆసక్తికర విషయాలు తెలియచేశాడు శేష్‌. అడివి శేష్ పెళ్లి గురించి మాట్లాడుతూ.. ”పెళ్లి చేసుకోమంటూ ఇంట్లో రోజూ ఒత్తిడి ఉండేది. ఒకప్పుడు అమ్మాయి అలా ఉండాలి, ఇలా ఉండాలి అనుకున్నారు. కానీ ఇప్పుడు అమ్మాయి అయితే చాలు అనే స్టేజ్‌కు వచ్చేసారు మా ఇంట్లో వాళ్ళు. పెళ్లి విషయం వచ్చిన ప్రతిసారి ఇండస్ట్రీలో సల్మాన్‌ ఖాన్‌ లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు అని చెబుతాను” అని అన్నారు.

Raviteja : షూటింగ్‌లో రవితేజకి గాయం.. పది కుట్లు.. అయినా నో రెస్ట్..

అయితే ఇంటర్వ్యూలో మరి సల్మాన్ ఖాన్ లాగా మీకు కూడా లవ్ ఎఫైర్స్‌ ఏమైనా ఉన్నాయా అని అడగగా.. శేష్ మాట్లాడుతూ..”ఆయనలా నాకు మాత్రం ఎవరితో ఎఫైర్స్‌ లేవు. అమెరికాలో ఉన్నప్పుడు ప్రేమలో పడ్డాను. కానీ ఆ ప్రేమలో కాస్త దెబ్బతిన్నాను. నా పుట్టినరోజు నాడే ఆమెకు పెళ్లి అయిపోయింది. దీంతో మళ్ళీ ప్రేమ జోలికి వెళ్ళకూడదు అనుకున్నాను” అంటూ తెలిపారు.