Yashoda : విడాకుల తర్వాత సమంత హీరోయిన్‌గా ఫస్ట్ సినిమా.. రిలీజ్ డేట్ ఫిక్స్

విడాకుల తర్వాత సమంత హీరోయిన్ గా అనౌన్స్ చేసిన మొదటి సినిమా 'యశోద'. ఈ సినిమాలో ప్రెగ్నెంట్ ఉమెన్ క్యారెక్టర్ లో చేయబోతోందని సమాచారం. తాజాగా ఇవాళ ఈ సినిమా రిలీజ్ డేట్ ని............

Yashoda : విడాకుల తర్వాత సమంత హీరోయిన్‌గా ఫస్ట్ సినిమా.. రిలీజ్ డేట్ ఫిక్స్

Sam

Samantha :  సమంత చైతూతో విడిపోయిన తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే సమంత చేతిలో మూడు పాన్ ఇండియా సినిమాలు, ఒక తమిళ్ సినిమా, ఒక వెబ్ సిరీస్, ఒక హాలీవుడ్ సినిమా ఉన్నాయి. త్వరలో బాలీవుడ్ సినిమాలకి కూడా ఓకే చెప్పబోతోంది. ఇలా వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది. వీటిలో లేడి ఓరియెంటెడ్ సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు కమర్షియల్ రోల్స్, నార్మల్ రోల్స్ చేసిన సమంత ఇక నుంచి డిఫరెంట్ రోల్స్ ట్రై చేయాలని చూస్తుంది.

 

ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో కొత్తగా ట్రై చేసింది. ఇక ‘పుష్ప’లో ఐటెం భామగా కూడా మెప్పించింది. ఇప్పుడు రాబోయే సినిమాల్లో కూడా మరిన్ని డిఫరెంట్ రోల్స్ చేయబోతుంది. ఇప్పటికే ఓ సినిమాలో లెస్బియన్ క్యారెక్టర్ చేయబోతుంది అని తెలిసింది. ఇక విడాకుల తర్వాత సమంత హీరోయిన్ గా అనౌన్స్ చేసిన మొదటి సినిమా ‘యశోద’. ఈ సినిమాలో ప్రెగ్నెంట్ ఉమెన్ క్యారెక్టర్ లో చేయబోతోందని సమాచారం.

Chay-Sam : చైతూని గుర్తుచేసుకున్న సమంత.. ఇన్‌స్టాలో కలిసి చేసిన సినిమా పోస్టర్

హరి-హరీష్ అనే యువ దర్శకుల డైరెక్షన్ లో సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా ‘యశోద’ తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఇవాళ ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. సమంత మెయిన్ లీడ్ లో లేడీ ఓరియెంటెడ్ గా రాబోతున్న ‘యశోద’ సినిమా 12 ఆగస్టు 2022న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్టు చిత్ర యూనిట్ తెలిపారు. విడాకుల తర్వాత సమంత మెయిన్ లీడ్ లో రాబోతున్న సినిమా కావడంతో యశోద సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. మరి ఈ సినిమాతో సమంత ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.