Agent Movie: ఏజెంట్ థియేట్రికల్ రైట్స్‌కు భారీ రేటు.. అయ్యగారితో మామూలుగా ఉండదు!

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తుండగా, పూర్తి స్పై థ్రిల్లర్ మూవీగా ఈ చిత్రాన్ని చిత్ర యూనిట్ రూపొందించింది. ఇక ఈ సినిమా నుండి ఇటీవల వరుస అప్డే్ట్స్ ఇస్తూ చిత్ర యూనిట్ సందడి చేస్తోంది.

Agent Movie: ఏజెంట్ థియేట్రికల్ రైట్స్‌కు భారీ రేటు.. అయ్యగారితో మామూలుగా ఉండదు!

Agent Movie: అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తుండగా, పూర్తి స్పై థ్రిల్లర్ మూవీగా ఈ చిత్రాన్ని చిత్ర యూనిట్ రూపొందించింది. ఇక ఈ సినిమా నుండి ఇటీవల వరుస అప్డే్ట్స్ ఇస్తూ చిత్ర యూనిట్ సందడి చేస్తోంది.

Agent Movie: ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకున్న ఏజెంట్

కాగా ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 28న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా చేసింది చిత్ర యూనిట్. అయితే తాజాగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌కు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా వినిపిస్తోంది. ఏజెంట్ చిత్రానికి సంబంధించిన నైజాం, సీడెడ్, ఏపీ రైట్స్‌ను భారీ రేటుకు అమ్మినట్లుగా తెలుస్తోంది.

Agent Movie: ఏజెంట్ ఫస్ట్ సింగిల్ అనౌన్స్‌మెంట్‌కు ముహూర్తం ఫిక్స్!

ఈ చిత్ర తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ఏకంగా రూ.35 కోట్ల భారీ రేటుకు అమ్ముడైనట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. గాయత్రి దేవి ఫిలింస్ అధినేత సతీష్ ఈ మేరకు ఏజెంట్ చిత్ర రైట్స్‌ను దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్న ఏజెంట్ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తోంది. హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.