Airtel Prepaid Plans : ఎయిర్‌టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే.. మరెన్నో డేటా బెనిఫిట్స్.. మీకు నచ్చిన ప్లాన్ రీఛార్జ్ చేసుకోండి!

Airtel Prepaid Plans : భారతి ఎయిర్‌టెల్ (Airtel) ఇటీవలే అనేక సర్కిళ్లలో చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్ టారిఫ్‌లను పెంచింది. రిలయన్స్ జియో (Reliance Jio) వంటి ఇతర టెలికాం ఆపరేటర్‌లతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో టెల్కో మరిన్ని ప్లాన్‌ల బేస్ టారిఫ్‌లను పెంచుతుందని భావిస్తున్నారు.

Airtel Prepaid Plans : ఎయిర్‌టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే.. మరెన్నో డేటా బెనిఫిట్స్.. మీకు నచ్చిన ప్లాన్ రీఛార్జ్ చేసుకోండి!

Airtel Rs 359 prepaid plan gets revamped_ Validity, benefits and more

Airtel Prepaid Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్ (Airtel) ఇటీవలే అనేక సర్కిళ్లలో చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్ టారిఫ్‌లను పెంచింది. రిలయన్స్ జియో (Reliance Jio) వంటి ఇతర టెలికాం ఆపరేటర్‌లతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో టెల్కో మరిన్ని ప్లాన్‌ల బేస్ టారిఫ్‌లను పెంచుతుందని భావిస్తున్నారు. మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్‌టెల్ రూ. 359 ప్లాన్ వ్యాలిడిటీని పెంచుతోంది.

ప్రస్తుతం ఈ ప్లాన్లు ప్రీపెయిడ్ యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. టెలికాం టాక్ నివేదిక ప్రకారం.. ఎయిర్‌టెల్ రూ. 359 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ గతంలో 28 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది. ఇప్పుడు పూర్తి నెల వ్యాలిడిటీని కూడా అందిస్తుంది. ఈ నెలలోని మొత్తం రోజులతో సంబంధం లేకుండా 28, 30 లేదా 31 రోజులు పూర్తి నెల క్యాలెండర్ వ్యాలిడిటీని పొందవచ్చు. రూ. 359 ప్లాన్‌లో క్లబ్ చేసిన అన్ని ప్లాన్ బెనిఫిట్స్ వివరంగా పరిశీలిద్దాం.

Airtel రూ.359 ప్లాన్ వివరాలు ఇవే :
నెలవారీ రీఛార్జ్ ప్లాన్ 2GB రోజువారీ డేటా లిమిట్‌తో ఒక క్యాలెండర్ నెల వ్యాలిడిటీని అందిస్తుంది. లోకల్, STD కాలింగ్ ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలు పొందవచ్చు. ఈ ప్లాన్ అదనపు బెనిఫిట్స్ ద్వారా ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్‌కు 28 రోజుల ఫ్రీ సభ్యత్వాన్ని పొందవచ్చు. ఈ యాప్ SonyLiv, LionsgatePlay, ErosNow, మరిన్నింటితో సహా ఎంచుకున్న ఏదైనా ఒక Xstream ఛానెల్‌కు ఉచితంగా యాక్సస్ అందిస్తుంది.

Read Also : Coca-Cola Edition Phone : రియల్‌మి నుంచి కోకా-కోలా ఫస్ట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది.. ఫిబ్రవరి 10న లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

ఎయిర్‌టెల్ వినియోగదారులు Apollo 24|7 సర్కిల్‌కు 3 నెలల సబ్‌స్క్రిప్షన్, ఫాస్ట్‌ట్యాగ్‌పై రూ. 100 క్యాష్‌బ్యాక్, హలో ట్యూన్స్, వింక్‌లకు ఉచిత యాక్సెస్ కూడా పొందవచ్చు. ఈ ప్లాన్‌తో, ఎయిర్‌టెల్ నెలవారీ రీఛార్జ్ ప్లాన్‌ల జాబితాలో మరో ప్లాన్‌ను చేర్చింది. ఒక క్యాలెండర్ నెల వ్యాలిడిటీతో ఇతర Airtel ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ల జాబితాను అందిస్తున్నాం.

Airtel Rs 359 prepaid plan gets revamped_ Validity, benefits and more

Airtel Prepaid Plans : Airtel Rs 359 prepaid plan gets revamped_ Validity, benefits

ఎయిర్‌టెల్ నెలవారీ రీఛార్జ్ ప్లాన్‌లు ఇవే :
రూ. 319 ప్లాన్ : ఈ ప్రీపెయిడ్ ప్లాన్ కింద వినియోగదారులు 2GB రోజువారీ డేటా బెనిఫిట్స్ పొందవచ్చు. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలతో ఒక క్యాలెండర్ నెల వ్యాలిడిటీని పొందవచ్చు. అపోలో 24|7 సర్కిల్‌కి ఉచిత యాక్సెస్, ఫాస్ట్‌ట్యాగ్, హెలోట్యూన్స్, వింక్‌పై రూ. 100 క్యాష్‌బ్యాక్ అదనపు బెనిఫిట్స్ అందిస్తుంది. రూ. 319, రూ. 359 ప్లాన్ దాదాపు ఒకే విధమైన ఆఫర్‌లను కలిగి ఉన్నాయి. కేవలం రెండో ప్లాన్‌లో Airtel Xstream యాప్ OTT ప్రయోజనాలు ఉన్నాయి.

రూ. 509 ప్లాన్: ఈ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 509కి ఒక నెల క్యాలెండర్ వ్యాలిడిటీని అందిస్తోంది. ఎయిర్‌టెల్ వెబ్‌సైట్‌లోని లిస్టింగ్ ప్రకారం.. ఈ ప్లాన్ మొత్తం 60GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, మొత్తం 300 SMSలను అందిస్తుంది. అపోలో 24|7 సర్కిల్, ఫాస్ట్‌ట్యాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్, హలో ట్యూన్స్, వింక్ వంటి అదనపు బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ ప్లాన్‌ల బెనిఫిట్స్, వాల్యూను పరిశీలిస్తే.. రూ. 509 ప్లాన్ మొత్తం 60 GB డేటాను అందిస్తుంది. కానీ, ఇతర ప్లాన్‌లను పరిశీలిస్తే.. 60GB డేటాను కూడా అందిస్తాయి. కానీ, 2GB రోజువారీ లిమిట్ అందిస్తుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp Accounts Ban : భారత్‌లో 36 లక్షల వాట్సాప్ అకౌంట్లు బ్యాన్.. అసలు కారణం తెలిస్తే షాకవుతారు..!