Akhanda: యూనిట్ పార్టీ.. ప్రగ్యాతో బాలయ్య చిల్ అవుట్

నందమూరి అభిమానులు చాలాకాలంగా బాలయ్య సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. కాగా, ఇప్పుడు మాస్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వస్తున్న..

Akhanda: యూనిట్ పార్టీ.. ప్రగ్యాతో బాలయ్య చిల్ అవుట్

Akhanda

Akhanda: నందమూరి అభిమానులు చాలాకాలంగా బాలయ్య సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. కాగా, ఇప్పుడు మాస్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వస్తున్న హ్యాట్రిక్ సినిమా అఖండ షూటింగ్ పూర్తిచేసుకుంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తికావాల్సింది. మధ్యలో కరోనా వచ్చి బ్రేకులు పడడంతో ఇప్పుడు పూర్తిచేసుకుంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టగా షూటింగ్ పూర్తయిన సందర్భంగా యూనిట్ సెలబ్రేషన్ చేసుకుంది.

Akhanda: దీపావళికే బాలయ్య ఆగమనం.. అధికారిక ప్రకటనే బ్యాలెన్స్!

ఈ సెండాఫ్ పార్టీకి డైరెక్ట‌ర్ బోయ‌పాటి, హీరో బాల‌కృష్ణ‌, హీరోయిన్ ప్రగ్యాజైస్వాల్ తో పాటు నిర్మాత‌లు, ఇత‌ర చిత్ర‌యూనిట్ స‌భ్యులంతా హాజరయ్యారు. ఈ అఖండ యూనిట్ పార్టీ ఫొటోలు ఇపుడు ఆన్ లైన్ లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ముఖ్యంగా బాల‌కృష్ణ‌, ప్ర‌గ్యాజైశ్వాల్ ఈ పార్టీలో చిల్ అవుట్ అవుతున్న స్టిల్ ఒక‌టి ఇపుడు నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. వైట్ అండ్ వైట్ డ్రెస్ లో బాల‌కృష్ణ చిరున‌వ్వుతో విక్ట‌రీ సింబ‌ల్ చూపిస్తుండ‌గా.. ప‌క్క‌నే ఉన్న ప్ర‌గ్యాజైశ్వాల్ హీరోతో క‌లిసి హ్యాపీ పార్టీ మూడ్‌లో ఉన్న ఫొటో సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

Akhanda: ముహూర్తం పెట్టేసిన బాలయ్య.. విడుదల ఎప్పుడంటే?

బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో ఇప్పటికే రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన సంగతి తెలిసిందే. సింహ, లెజెండ్ సినిమాల తర్వాత ఈ కాంబినేషన్ లో సినిమా అనగానే అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్లే అఖండ నుండి వదిలిన పోస్టర్లు, టీజర్లు సినిమా మీద మరింత హైప్ పెంచేశాయి. ఇక, ఇప్పుడు ఎప్పుడెప్పుడు సినిమా తెరమీదకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. త్వరలోనే విడుదలకు కూడా ముహూర్తం పెట్టాయనున్నారు యూనిట్.