Akshay Kumar : ఉత్తరాఖండ్ బ్రాండ్ అంబాసిడర్‌గా అక్షయ్ కుమార్

తాజాగా అక్షయ్ కుమార్ కి మరో అరుదైన గౌరవం దక్కింది. కొత్తగా ఉత్తరాఖండ్ రాష్ట్రం నుంచి ఆయకు భారీ సత్కారం లభించింది. ఆ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసడర్ గా అక్షయ్ కుమార్ ని నియమించారు....

Akshay Kumar :  ఉత్తరాఖండ్ బ్రాండ్ అంబాసిడర్‌గా అక్షయ్ కుమార్

Akshay Kumar

Akshay Kumar :   బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అక్షయ్ చేసిన సినిమాలన్నీ యిటీవల మంచి విజయాలు సాధిస్తూ భారీ కలెక్షన్స్ సాధిస్తున్నాయి. ఇప్పటికే ఫోర్బ్స్ లిస్ట్ లో కూడా చేరిపోయాయడు అక్షయ్. ఇక అప్పుడప్పుడు తనకి తోచినంతలో సేవా కార్యక్రమాలు కూడా చేస్తూనే ఉంటారు. దేశభక్తి విషయంలో అస్సలు తగ్గడు. దేశానికి సపోర్ట్ చేసే విషయంలో, దేశాన్ని గర్వపడేలా చేసే విషయాలలో ముందుంటాడు అక్షయ్ కుమార్.

తాజాగా అక్షయ్ కుమార్ కి మరో అరుదైన గౌరవం దక్కింది. కొత్తగా ఉత్తరాఖండ్ రాష్ట్రం నుంచి ఆయకు భారీ సత్కారం లభించింది. ఆ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసడర్ గా అక్షయ్ కుమార్ ని నియమించారు. అక్షయ్ కుమార్ కూడా ఉత్తరాఖండ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటానికి ఒప్పుకున్నారు. ఈ విషయం పై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అక్షయ్ ని సత్కరించిన ఫోటోలు షేర్ చేస్తూ.. ”ఈ రోజు ముఖ్యమంత్రి నివాసంలో ప్రముఖ నటుడు, యువత స్ఫూర్తి, నా స్నేహితుడు శ్రీ అక్షయ్ కుమార్ జీకి స్వాగతం పలికి, అభినందించాము. రాష్ట్రంలోని యువతను చైతన్యవంతం చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అక్షయ్ కుమార్ జీ ప్రశంసించారు. ఉత్తరాఖండ్ అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తారని హామీ ఇచ్చారు.” అని పోస్ట్ చేశారు.

Balakrishna : ‘అన్ స్టాపబుల్ విత్ NBk’ సరికొత్త రికార్డు..

ఇక అక్షయ్ కుమార్ కూడా ఉత్తరాఖండ్ ముస్సోరిలో కార్ లో వెళ్తూ బయట మంచు పడుతున్న అద్భుతమైన దృశ్యాన్ని వీడియో తీసి తన ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ వీడియో షేర్ చేస్తూ.. ”ప్రేమలో ఉండటం అంటే ఏమిటి? మనం ఉత్తరాఖండ్‌ని దేవభూమి అని పిలుస్తాము. చాలా మంది షూటింగ్స్ మంచి లొకేషన్స్ కోసం ప్రపంచంలో చాలా చోట్లకి వెళ్తారు ఒక్కసారి ముస్సోరిని చూడండి. ఇది మన మనసుకు దగ్గరగా ఉంటుంది” అని పోస్ట్ చేస్తూ ఉత్తరాఖండ్ ని ప్రమోట్ చేశారు.