Akshay kumar : బ్రిటిష్ వాళ్ళు చేసిందే మనము చేస్తున్నాము.. సౌత్, నార్త్ అనే విభజన కరెక్ట్ కాదు..

అక్షయ్ కుమార్ నటించిన ‘పృథ్వీరాజ్‌’ సినిమా త్వరలో రిలీజ్ కి ఉండటంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో అక్షయ్ ని ఓ విలేఖరి సౌత్, నార్త్ సినిమాల..............

Akshay kumar : బ్రిటిష్ వాళ్ళు చేసిందే మనము చేస్తున్నాము.. సౌత్, నార్త్ అనే విభజన కరెక్ట్ కాదు..

Akshay

Akshay kumar :   గత కొద్ది కాలంగా సౌత్ సినిమాలు బాలీవుడ్ లో కూడా భారీ విజయం సాధిస్తుండటంతో నార్త్ ఇండస్ట్రీ, సౌత్ ఇండస్ట్రీ అని మాట్లాడుతున్నారు. ఇది గతంలో ఉన్నా ఈ మధ్య మరింత ఎక్కువ అయింది. బాలీవుడ్ పరిశ్రమపై సౌత్ యాక్టర్లు కామెంట్లు చేయడం, వాటికి బాలీవుడ్ యాక్టర్లు కౌంటర్లు ఇవ్వడం జరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ఇది భాషా వివాదంగా కూడా మారి సౌత్, బాలీవుడ్ వాళ్ళు సోషల్ మీడియాలో మాటకు మాట అనుకున్నారు. స్టార్ హీరోలు సైతం ఈ వివాదంలో దూరారు. దీంతో కొన్ని రోజులుగా ఈ వివాదం నడుస్తూనే ఉంది.

Special Songs: స్టార్ డైరెక్టర్లే.. స్పెషల్ సాంగ్స్‌పై స్పెషల్ ఇంట్రెస్ట్!

 

తాజాగా అక్షయ్ కుమార్ నటించిన ‘పృథ్వీరాజ్‌’ సినిమా త్వరలో రిలీజ్ కి ఉండటంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో అక్షయ్ ని ఓ విలేఖరి సౌత్, నార్త్ సినిమాల గురించి, భాషా వివాదం గురించి అడగగా అక్షయ్ మాట్లాడుతూ..‘‘ఈ సౌత్, నార్త్ విభజన నాకు నచ్చదు. సౌత్‌ ఇండస్ట్రీ, నార్త్‌ ఇండస్ట్రీ అంటూ సపరేట్ గా మాట్లాడుతుంటే సహించలేకపోతున్నాను. మనమంతా ఒకే ఇండస్ట్రీకి చెందినవాళ్ళం. ఇలాంటి ప్రశ్నలు ఇకపై అడగకుండా ఉంటారని అనుకుంటున్నాను. గతంలో బ్రిటిషర్లు ఇక్కడకు వచ్చి మనల్ని విభిజించి, మనల్ని పరిపాలించారు. ఇప్పుడు మనం కూడా అదే చేస్తున్నాము. మనమంతా ఒక్కటే అని ఎప్పుడైతే అనుకుంటామో ఆరోజు ఇంకా బాగా పని చేస్తాము” అని తెలిపారు.