Akshay Kumar : షూటింగ్ లో గాయపడ్డ అక్షయ్ కుమార్.. ఆగిపోయిన సినిమా షూట్..

ఓ పక్కన సినిమాలు వచ్చినవి వచ్చినట్టు ఫ్లాప్ అవుతున్నా వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు అక్షయ్. కొత్త సినిమాలు, రీమేక్ సినిమాలు కలిసి రాకపోవడంతో ఇప్పుడు వరుసగా సీక్వెల్స్ మీద పడ్డాడు. ఒకప్పుడు తన హిట్ కామెడీ సినిమాలకు ఇప్పుడు సీక్వెల్స్ తీస్తున్నాడు. అందులో భాగంగానే.....................

Akshay Kumar : షూటింగ్ లో గాయపడ్డ అక్షయ్ కుమార్.. ఆగిపోయిన సినిమా షూట్..

Akshay Kumar injured in Bade miyan Chote miyan movie shoot

Akshay Kumar :  ఒకప్పుడు బాలీవుడ్(Bollywood) లో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోగా ఉన్న అక్షయ్ కుమార్(Akshay Kumar) కు లాస్టియర్ నుంచి కాలం కలిసి రావట్లేదు. వచ్చిన సినిమా వచ్చినట్టుగా ఫ్లాప్ అవుతుంది. ఒకప్పుడు బాలీవుడ్ లో 100 కోట్లు ఈజీగా రాబట్టగలిగే స్టార్ హీరోగా అక్షయ్ కుమార్ ఇప్పుడు ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేకపోతున్నాడు. ఒక్క ఇయర్ లోనే ఏకంగా ఆరు సినిమాలు రిలీజ్ చేసినా ఆరు ఫ్లాప్స్ అయ్యాయి అక్షయ్ కు. ఆత్రంగిరే, బచ్చన్ పాండే, సామ్రాట్ పృధ్విరాజ్, రక్షాబంధన్, కట్ పుత్లీ , రామ్ సేతు, ఇటీవల సెల్ఫీ సినిమా.. ఇవన్నీ పరాజయం పాలయ్యాయి.

ఓ పక్కన సినిమాలు వచ్చినవి వచ్చినట్టు ఫ్లాప్ అవుతున్నా వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు అక్షయ్. కొత్త సినిమాలు, రీమేక్ సినిమాలు కలిసి రాకపోవడంతో ఇప్పుడు వరుసగా సీక్వెల్స్ మీద పడ్డాడు. ఒకప్పుడు తన హిట్ కామెడీ సినిమాలకు ఇప్పుడు సీక్వెల్స్ తీస్తున్నాడు. అందులో భాగంగానే బడే మియాన్ చోటే మియాన్ సినిమాకు సీక్వెల్ లో నటిస్తున్నాడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం ఈ సినిమా స్కాట్లాండ్ లో షూటింగ్ జరుగుతుంది. ఇందులో టైగర్ ష్రాఫ్ కూడా నటిస్తున్నాడు.

Rangamarthanda Review : రంగమార్తాండ.. మన అమ్మానాన్నల కథ.. సినిమా అంతా ఏడిపించేశారు..

తాజాగా బడే మియాన్ చోటే మియాన్ సినిమా షూటింగ్ లో ఫైట్ సీక్వెన్స్ లు తెరకెక్కిస్తుండగా అక్షయ్ కి గాయం అయింది. ఈ సీన్ లో టైగర్ ష్రాఫ్ కూడా ఉన్నాడు. ఫైట్ సీక్వెన్స్ లో అక్షయ్ కి మోకాలి దగ్గర దెబ్బ తగిలినట్టు తెలుస్తుంది. దీంతో అక్షయ్ క్లోజప్స్ మాత్రమే తీసుకొని షూటింగ్ ఆపేసారు. ప్రస్తుతం అక్షయ్ అక్కడే స్కాట్లాండ్ లో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే అక్షయ్ రెస్ట్ మోడ్ లో ఉండటంతో అక్షయ్ లేని సీన్స్ ని షూట్ చేయాలని చిత్రయూనిట్ భావిస్తున్నారు. ఇక అక్షయ్ గాయపడ్డాడని తెలిసి అభిమానులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.