OMG 2 Teaser : సూపర్ హిట్ సీక్వెల్ టీజర్ వచ్చేసింది.. ఈసారి నాస్తికుడు కోసం కాదు.. భక్తుడు కోసం!

సూపర్ హిట్ మూవీ OMG సీక్వెల్ రెడీ అయ్యింది. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది. ఈసారి నాస్తికుడు కోసం కాదు భక్తుడు కోసం దివి నుంచి భువికి..

OMG 2 Teaser : సూపర్ హిట్ సీక్వెల్ టీజర్ వచ్చేసింది.. ఈసారి నాస్తికుడు కోసం కాదు.. భక్తుడు కోసం!

Akshay Kumar Pankaj Tripathi Yami Gautam OMG 2 Teaser released

OMG 2 Teaser : 2012లో పరేష్ రావల్‌ ప్రధాన పాత్రలో అక్షయ్ కుమార్ దేవుడిగా కనిపిస్తూ వచ్చిన బాలీవుడ్ చిత్రం OMG. ఈ సినిమా తెలుగులో వెంకటేష్ అండ్ పవన్ కళ్యాణ్.. గోపాల గోపాల పేరుతో రీమేక్ చేశారు. ఈ మూవీ రెండు చోట్ల సూపర్ హిట్టుగా నిలిచింది. 11 ఏళ్ళ తరువాత ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్ ని తీసుకు వస్తున్నారు మేకర్స్. మొదటి భాగంలో అక్షయ్ కుమార్ శ్రీకృష్ణుడిగా కనిపించాడు. ఈ సీక్వెల్ లో శివుడిగా దర్శనమివ్వబోతున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ అయ్యింది.

Mark Antony : సైన్స్ ఫిక్షన్, హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ విశాల్ ‘మార్క్ ఆంటోని’.. వినాయక చవితి కానుకగా విడుదల..

ఈ సినిమాలో పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. యామీ గౌతమ్, ‘రామాయణ్’ ఫేమ్ అరుణ్ గోవిల్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇక మొదటి భాగంలో దేవుడు నాస్తికుడు అయిన పరేష్ రావల్‌ కోసం దివి నుంచి భువికి దిగివస్తే, ఈ సినిమాలో పరమ భక్తుడు అయిన పంకజ్ త్రిపాఠి కోసం వస్తాడని టీజర్ చూస్తే అర్ధమవుతుంది. ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవుతుంది అంటూ ఇటీవల ప్రచారం జరిగింది. ఈ మూవీ ఆగస్ట్ 11న థియేటర్స్ లోనే సందడి చేయనుంది.

Dhwani : షార్ట్ ఫిలిం చేసిన పదేళ్ల కుర్రాడు.. నిర్మాత బెల్లంకొండ సురేష్ చేతుల మీదుగా విడుదలైన ‘ధ్వని’

ఇది ఇలా ఉంటే, అక్షయ్ కుమార్ గతంలో మతం గురించి ఇచ్చిన ఒక స్టేట్‌మెంట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ‘సూర్యవంశీ’ మూవీ ప్రమోషన్స్ సమయంలో అక్షయ్ మాట్లాడుతూ.. “నేను ఏ మతాన్ని నమ్మను. నేను భారతీయుడిని మాత్రమే నమ్ముతాను. సినిమా కూడా అదే చూపిస్తుంది. సినిమాని మేము హిందువు లేదా ముస్లిం అనే ఆలోచన లేదా మతం పరంగా చూడడం లేదు” అని వ్యాఖ్యానించాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.