Akshay Kumar : కుర్ర హీరోయిన్స్‌తో రొమాన్స్ చేస్తే తప్పేంటి..? ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్ అంటున్న అక్షయ్..

ఈ ఏజ్ లో కుర్ర హీరోయిన్స్ తో రొమాన్స్ చేయడం, వాటి మీద ట్రోల్స్ రావడం గురించి ఈ షోలో కరణ్ ప్రస్తావించగా అక్షయ్ కుమార్ వీటిపై స్పందించాడు. ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అంటన్నారు అక్షయ్ కుమార్. బాలీవుడ్ లో ఏ స్టార్ హీరోలకు...........

Akshay Kumar : కుర్ర హీరోయిన్స్‌తో రొమాన్స్ చేస్తే తప్పేంటి..? ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్ అంటున్న అక్షయ్..

Akshay Kumar

Akshay Kumar :   టాలీవుడ్ ,బాలీవుడ్ , కోలీవుడ్.. ఇలా ఇండస్ట్రీ ఏదైనా సీనియర్ హీరోలకు హీరోయిన్లను సెట్ చెయ్యడం కొంచె కష్టమే. కానీ 60 కి దగ్గర పడుతున్న బాలీవుడ్ హీరో అక్షయ్ కి మాత్రం హీరోయిన్ ని వెతకడం చాలా ఈజీగా ఫీలవుతారు మేకర్స్. మరో వైపు 30 ఏళ్ల తేడా ఉన్న హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న వాళ్లకి దిమ్మ తిరిగిపోయే సమదానం చెప్పారు అక్షయ్. తాజాగా కాఫీ విత్ కరణ్ షోకి గెస్టుగా వచ్చిన అక్షయ్ పలు విషయాలని షేర్ చేసుకున్నాడు.

ఈ ఏజ్ లో కుర్ర హీరోయిన్స్ తో రొమాన్స్ చేయడం, వాటి మీద ట్రోల్స్ రావడం గురించి ఈ షోలో కరణ్ ప్రస్తావించగా అక్షయ్ కుమార్ వీటిపై స్పందించాడు. ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అంటన్నారు అక్షయ్ కుమార్. బాలీవుడ్ లో ఏ స్టార్ హీరోలకు లేనంత స్పీడ్ ఈ హిట్ మెషీన్ అక్షయ్ కుమార్ సొంతం. మినిమం 10 సినిమాల్ని లైన్లో పెట్టి సంత్సరానికి కనీసం 3నుంచి 4 సినిమాలు రిలీజ్ చేసే సీనియర్ హీరో అక్షయ్ ని చూసి కుళ్ళుకుంటున్నారట అందరూ. అక్షయ్ కుమార్ 60 కి దగ్గరవుతున్నా 20 ఏళ్ల హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు.

Purnaa : దుబాయ్ ఈవెంట్లో పూర్ణ సందడి..

పృద్విరాజ్ సినిమాలో తనకంటే 30ఏళ్లు చిన్నదైన మానుషి చిల్లర్ తో నటించినందుకు బాగా నెగెటివ్ కామెంట్స్ ఫేస్ చేశారు అక్షయ్. కానీ ఈ విషయంలో అక్షయ్ మాత్రం అందరికీ నేనంటే జెలస్, అందుకే నా మీద అలాంటి కామెంట్స్ చేస్తారు. అసలు నేను 55 ఏళ్ల వయసున్నట్టు కనిపిస్తానా, నేను యంగ్ అని ఫీల్ అవుతున్నా కాబట్టి యంగ్ హీరోయిన్స్ తో చేస్తున్నా అని అన్నారు అక్షయ్. అక్షయ్ కుమార్ అన్ని రకాల జానర్స్ ట్రై చేస్తూనే ఉంటారు. సీనియర్ హీరో అయినా యంగ్ హీరోలతో పోటీపడుతూ యాక్షన్ స్టంట్స్ చేస్తూనేఉంటారు. ప్రస్తుతం అక్షయ్ వరసగా ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఇలా 3 నెలల్లో 3 సినిమాల్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ 3 సినిమాల్లో అక్షయ్ భూమి పెడ్నేకర్, రకుల్ ప్రీత్ సింగ్, జాక్విలిన్, నుస్రత్ బరూచా లాంటి తనకన్నా కనీసం పాతికేళ్లు చిన్న వాళ్ళైన యంగ్ హీరోయిన్ల సరసన నటిస్తున్నారు.