Muslim Sculptors : ముస్లిం శిల్పులపై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

హర్యానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ్య సభ్యుడు రామ్ చందర్ జంగ్రా ముస్లిం శిల్పులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

Muslim Sculptors :  ముస్లిం శిల్పులపై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

Mp

Muslim Sculptor  హర్యానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ్య సభ్యుడు రామ్ చందర్ జంగ్రా ముస్లిం శిల్పులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ లో ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాంచందర్ జంగ్రా.. శిల్పులు, శిల్పాల గురించి మాట్లాడుతూ.. ముస్లిం శిల్పులందరూ లార్డ్(దేవుడు) విశ్వకర్మ వారసులేనని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మొగల్ చక్రవర్తి బాబర్ భారతదేశానికి వచ్చినప్పుడు ఆయన వెంట శిల్పులను తెచ్చుకోలేదన్నారు .

ఇరాక్‌, ఇరాన్‌, సౌదీ అరేబియా లాంటి దేశాల్లో ఎటుచూసినా ఇసుక దిబ్బ‌లు,ఆయిల్ మాత్రమే క‌నిపిస్తాయ‌ని, అక్క‌డ శిల్ప‌క‌ళ అనేదే లేద‌ని రామ్ చంద‌ర్ జంగ్రా చెప్పారు. కాబ‌ట్టి ప్ర‌పంచంలోని ముస్లిం శిల్పులంతా విశ్వ‌క‌ర్మ వార‌సులేనన్నారు. కాగా, జంగ్రా వ్యాఖ్య‌ల‌పై  విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.