Shanmukh -Deepthi: అల్ ది బెస్ట్ దీపూ.. దీప్తి బ్రేకప్ మెసేజ్‌కి షణ్ముఖ్ రిప్లై!

అనుకున్నదే అయింది.. యూట్యూబ్ క్యూట్ కపుల్ దీప్తి సునయన-షణ్ముఖ్ జస్వంత్ రిలేషన్ బ్రేకప్ అయిపొయింది. బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లు షణ్ముఖ్‌ జశ్వంత్‌, అతని ప్రేయసి దీప్తి సునయన బ్రేకప్‌..

Shanmukh -Deepthi: అల్ ది బెస్ట్ దీపూ.. దీప్తి బ్రేకప్ మెసేజ్‌కి షణ్ముఖ్ రిప్లై!

Deepthi Sunaina Shanmukh

Shanmukh -Deepthi: అనుకున్నదే అయింది.. యూట్యూబ్ క్యూట్ కపుల్ దీప్తి సునయన-షణ్ముఖ్ జస్వంత్ రిలేషన్ బ్రేకప్ అయిపొయింది. బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లు షణ్ముఖ్‌ జశ్వంత్‌, అతని ప్రేయసి దీప్తి సునయన బ్రేకప్‌ చెప్పుకోబోతున్నారంటూ కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం నిజమైంది. తాజాగా ఇదే నిజమని తేల్చేసింది దీప్తి. తామిద్దరం విడిపోతున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మేరకు ఆమె తాజాగా ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టింది.

Telugu Young Hero’s: ఒక్క హిట్ ప్లీజ్.. యంగ్ హీరోలకు క్రూషియల్ ఏడాది!

”ఎంతో ఆలోచించిన తర్వాత నేను, షణ్ముఖ్‌ పరస్పర అంగీకారంతో ప్రేమ బంధం నుంచి విడిపోయి.. మా దారులు మేము చూసుకోవాలని నిర్ణయించుకున్నాం. బ్రేకప్‌ నిర్ణయం మా మధ్య ఎంతోకాలం నుంచి నడుస్తోంది. ఈక్రమంలోనే మేమిద్దరం కలిసి ఉండటానికి ఎంతో ప్రయత్నించి.. నిజ జీవితాన్ని విస్మరించాం. మా దారులు వేరని అర్థమైంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మాకు మీ అండ ఎంతో అవసరం. దయచేసి మా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించరని కోరుకుంటున్నాం” అని దీప్తి పోస్ట్ చేసింది.

Telugu Star Hero’s: సక్సెస్ కోసం ఎదురుచూపులు.. కోటి ఆశలతో కొత్త ఏడాది!

దీప్తి పోస్ట్ పై షణ్ముఖ్ స్పందించాడు. ‘‘ఏ విషయంలోనైనా నిర్ణయాలు తీసుకునే హక్కు తనకి ఉంది! ఇప్పటివరకూ తను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఇకపై ఆమె ఆనందంగా ఉండాలనుకుంటున్నాను. మేం వేర్వేరు దారుల్లో ప్రయాణించినా సరే పరస్పరం సపోర్ట్‌ చేసుకుంటూనే ఉంటాం. నేను ఓ మంచి వ్యక్తిలా మారేందుకు తోడ్పడిన నీకు ధన్యవాదాలు. నువ్వు సంతోషంగా ఉండాలి..!! ఆల్‌ ది బెస్ట్‌, జాగ్రత్తగా ఉండు దీపు’’ అని షణ్ముఖ్ రాసుకొచ్చారు.

Shannu

Shannu

RRR Postpone: టెన్షన్ తట్టుకోలేకపోతున్నాం.. వుయ్ వాంట్ అఫీషియల్ కన్ఫర్మేషన్

యూట్యూబ్‌, డబ్‌స్మాష్‌ వీడియోల కోసం దీప్తి-షణ్ముఖ్‌ మొదటిసారి కలిశారు. వ్యక్తిగతంగా ఇద్దరికీ డ్యాన్స్‌ అంటే ఎక్కువ ఆసక్తి ఉండటంతో ఎన్నో రీల్స్‌, కవర్‌ సాంగ్స్‌ చేశారు. దీంతో ఈజంటకు విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. అనంతరం వీళ్లిద్దరూ తమ స్నేహాన్ని మరో మెట్టు ఎక్కించి ప్రేమగా మార్చుకున్నారు. పలు షోలు, సోషల్‌ మీడియా లైవ్‌ సెక్షన్స్‌లలో దీప్తి అంటే తనకెంతో ఇష్టమని షణ్ముఖ్‌.. అదే మాదిరిగా షణ్ముఖ్‌ అంటే తనకు అమితమైన ప్రేమ అని దీప్తి చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఇద్దరూ దూరంగా ఉండాలని నిర్ణయించుకుని బంధానికి గుడ్ బై చెప్పేసుకున్నారు.