2022 Tollywood Films: సినిమా కళ్లన్నీ ఈ ఏడాది మీదే.. దేశమంతా టాలీవుడ్ గురించే!

స్టార్టింగ్ లో ఎంతలా ఊపిందో.. వెళ్తూ వెళ్తూ టాలీవుడ్ కి అంతకుమించిన బంపర్ హిట్స్ ఇచ్చి బైబై చెప్పేసింది 2021. ఇక ప్రెజెంట్ అందరి కళ్లు 2022 మీదే. అన్నీ ఆలోచనలు టాలీవుడ్ గురించే.

2022 Tollywood Films: సినిమా కళ్లన్నీ ఈ ఏడాది మీదే.. దేశమంతా టాలీవుడ్ గురించే!

2022 Tollywood Films

2022 Tollywood Films: స్టార్టింగ్ లో ఎంతలా ఊపిందో.. వెళ్తూ వెళ్తూ టాలీవుడ్ కి అంతకుమించిన బంపర్ హిట్స్ ఇచ్చి బైబై చెప్పేసింది 2021. ఇక ప్రెజెంట్ అందరి కళ్లు 2022 మీదే. అన్నీ ఆలోచనలు టాలీవుడ్ గురించే. పాన్ ఇండియా ప్రాజెక్ట్స్, క్రేజీ మల్టీస్టారర్స్, భారీ బడ్జెట్ మూవీస్.. వాట్ నాట్ టాలీవుడ్.. పెద్ద సినిమాల జాతరే చేయబోతుంది. అదీ నేషనల్ వైడ్. ఎందుకంటే ఇప్పుడు టాలీవుడ్ సినిమా అంటే ఇండియన్ సినిమా కదా. 2022.. ఈ సంవత్సరమంతా ధియేటర్లో పెద్ద సినిమాల జాతరే. తెలుగు సినిమాకు ఫుల్ ఫ్లెడ్జ్ డ్ గా నేషనల్ స్టేటసొచ్చిన తర్వాత రాబోతున్న సినిమాలు కావడంతో ఇంట్రెస్ట్ కేవలం తెలుగు ప్రేక్షకుల్లోనే కాదు.. దేశమంతా పెరిగింది. ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ సినిమానే అనేస్తోంది నార్త్ ఇండస్ట్రీ. ఇక్కడి హీరోలు కావాలని అక్కడి దర్శకులు అంటుంటే… ఇక్కడి దర్శకులపై అక్కడి హీరోలు మనసు పారేసుకుంటున్నారు. ఇక ముంబై ప్రొడ్యూసర్స్ లో కొందరిప్పటికే టాలీవుడ్ జపం చేస్తున్నారు.

AR Rahman: ఏఆర్ రెహమాన్ పెద్ద కూతురికి సౌండ్ ఇంజినీర్‌తో నిశ్చితార్థం

తారక్, రాజమౌళి కలిస్తే సినిమా ఎలా ఉంటుందో చూశాం. చరణ్, రాజమౌళి కాంబో స్టామినా ఏంటో తెలుసు. కానీ ఫస్ట్ టైమ్ ముగ్గురు కలిసొస్తే బాక్సాఫీస్ బద్ధలవాల్సిందే అన్నట్టుంది ట్రిపుల్ ఆర్ మేనియా. ఎన్టీఆర్, చరణ్ లీడ్ రోల్స్ లో బాలీవుడ్, హాలీవుడ్ స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన ట్రిపుల్ఆర్ జనవరి 7న రిలీజ్ కాబోతోంది. మనకంటే ఎక్కువగా బాలీవుడ్ వెయిట్ చేస్తోన్న ఈ మూవీ 2022కి గ్రాండ్ వెల్కమ్ చెబుతోంది. తారక్, చరణ్ లను ఒకేసారి పాన్ ఇండియా వైడ్ ప్రమోట్ చేస్తోంది జక్కన్న ట్రిపుల్ ఆర్.

Sankranthi Releases: పెద్ద పండక్కి మేమున్నామంటున్న చిన్న సినిమాలు!

బ్యాక్ టూ బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో ఫాన్స్ కి ఫీస్ట్ ఇస్తున్న ప్రభాస్.. రాధేశ్యామ్ తో ఆ ఫీవర్ని ఇంకాస్త పెంచబోతున్నారు. మూడేళ్ల నుంచి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న రాధేశ్యామ్ జనవరి 14న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ ఎంట్రీ ఇస్తోంది. ప్రభాస్, పూజాహెగ్డే జంటగా భారీ స్కేల్ లో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. ఇప్పటికే రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. మెయిన్ సిటీస్ లో డార్లింగ్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. జనవరి 7 నుంచి డైరెక్ట్ గా గ్లోబల్ స్టార్ రంగంలోకి దిగబోతున్నారు.

Ramgopal Varma: ప్రేక్షకులు థియేటర్లకు రాకపోతే ప్రభుత్వమే బాధ్యత వహించాలి: ఆర్జీవీ

2022.. ప్రభాస్ నామ సంవత్సరంగా మారబోతుంది. అన్నీ అనుకూలిస్తే గ్లోబల్ స్టార్ ఈ ఏడాది రాధేశ్యామ్ తో పాటూ ఆదిపురుశ్, సలార్ సినిమాలను కూడా చూపిస్తారు. జూలై 29న ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తోన్న సలార్ రిలీజయ్యే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత ఆగస్ట్ 11న రాముడిగా ప్రభాస్ ఆదిపురుష్ తీసుకురాబోతున్నారు. ఈ రెండు సినిమాలకు సూపర్ క్రేజ్ ఉన్న డైరెక్టర్స్ పనిచేస్తుండటంతో బజ్ ఇంకా పెరిగింది. 150కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటోన్న గ్లోబల్ స్టార్ సినిమా ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు వరల్డ్ ఆడియెన్స్.

Aditi Budhathoki: మనోళ్ళని ఫిదా చేసేస్తున్న నేపాలీ భామ అదితి!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరీర్ లో రాబోతున్న బిగ్గెస్ట్ మ్యాసివ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లైగర్. ఈ సినిమాకు కూడా 2022 వేదికైంది. పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో కరణ్ జోహార్ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్న లైగర్ మూవీ ఆగస్ట్ 25న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే నార్త్ లో ఈ సినిమాపై ఫుల్ గా ఎక్స్ పెక్టేషన్స్ పెంచేస్తున్నాడు కరణ్ జోహార్. విజయ్ దేవరకొండను పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు. 2022 లో రాబోతున్న మరో పెద్ద సినిమా హరిహర వీరమల్లు. ఫస్ట్ టైమ్ పవన్ కళ్యాణ్ ఈ మూవీతో ఒకేసారి పాన్ ఇండియా వైడ్ ప్రొజెక్ట్ కాబోతున్నారు. పీరియాడికల్ డ్రామాగా క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ రిచ్ కలరింగ్ మూవీ ఏప్రిల్ 29 నుంచి పోస్ట్ పన్ అయినట్టు తెలుస్తోంది. పవర్ స్టార్ నెవర్ బిఫోర్ లుక్ లో కనిపిస్తున్న ఈ క్రేజీ మూవీ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

Shraddha Das: శ్రద్ధా అందాలతోనే మర్డర్ చేస్తే ఎలా?!

2021లో ఇండియాలోనే హైయ్యెస్ట్ గ్రాసర్ మూవీగా రికార్డ్ కొట్టిన పుష్పరాజ్.. 2022లోనూ ఆ స్టామినాను చూపిస్తా అంటున్నాడు. పుష్ప ది రూల్.. రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి నుంచి మొదలవుతుంది. ఫహాద్, బన్నీల క్లాష్ తో ఓ రేంజ్ లో రాబోతున్న పుష్ప సీక్వెల్ వచ్చే దసరాను ఫిక్స్ చేసే ఛాన్స్ ఉంది. ఫ్యామిలీమ్యాన్ 2, పుష్ప ఐటమ్ సాంగ్ తో పాన్ ఇండియా స్టేటస్ సాధించిన హీరోయిన్ సమంతా. బ్యాక్ టు బ్యాక్ రెండు వుమెన్ సెంట్రిక్ సినిమాలతో 2022లో ఎంటర్ టైన్ చేయబోతుంది. మైథలాజికల్ ఫిల్మ్ శాకుంతలంతో పాటూ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ యశోద.. ఈ ఏడాదే థియేటర్స్ కి రాబోతున్నాయి. ఈ రెండూ సౌత్ టు నార్త్ ఆడియెన్స్ ను టార్గెట్ చేశాయి.