Allu Arha : అర్హ బర్త్‌‌డే కి స్పెషల్ వీడియో షేర్ చేసిన అల్లు స్నేహ

ఇవాళ అర్హ పుట్టినరోజు. అర్హ నేటికి ఐదేళ్లు పూర్తి చేసుకుని ఆరో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. స్నేహ షేర్ చేసిన వీడియోలో.. అర్హ చెస్‌ గేమ్‌ ఆడుతూ సందడి చేస్తుంది.

Allu Arha : అర్హ బర్త్‌‌డే కి స్పెషల్ వీడియో షేర్ చేసిన అల్లు స్నేహ

Arha

Allu Arha :  ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన కుటుంబానికి చాలా ప్రాధాన్యత ఇస్తారన్న విషయం మనకి తెలిసిందే. ఖాళీ దొరికితే తన భార్య ఇద్దరు పిల్లలతో సరదాగా గడుపుతాడు. ఇక అల్లు అర్జున్‌ భార్య స్నేహ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పుడూ పిల్లలతోనే ఉంటూ సరదాగా గడుపుతూ పిల్లలకి సంబంధించిన వీడియోస్, ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఇవాళ అల్లు అర్హ పుట్టిన రోజూ సందర్భంగా ఓ స్పెషల్ వీడియోని షేర్ చేసింది.

Punam Khaur : ఈటెలను కలిసిన పూనమ్ కౌర్.. వైరల్ అవుతున్న ఫోటోలు..

ఇవాళ అర్హ పుట్టినరోజు. అర్హ నేటికి ఐదేళ్లు పూర్తి చేసుకుని ఆరో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. స్నేహ షేర్ చేసిన వీడియోలో.. అర్హ చెస్‌ గేమ్‌ ఆడుతూ సందడి చేస్తుంది. ఒకే చోట చాలా చెస్ బోర్డులు పెట్టి ఒక్కొక్క చేస్‌ గేమ్‌ బోర్డులో పావులు కదుపుతూ, పరిగెడుతూ, నవ్వుతూ, డ్యాన్స్ చేస్తూ ఉంది అర్హ. ఈ వీడియోలో స్నేహ, అల్లు అర్జున్, అల్లు అరవింద్ కూడా ఉన్నారు. వీరంతా అర్హని ఎంకరేజ్‌ చేస్తున్నట్టు వీడియోలో చూపించింది.

Viswanathan Anand : బాలీవుడ్ లో చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ బయోపిక్

ఇక అల్లు అర్జున్ కూడా తన గారాల పట్టికి స్పెషల్ విషెష్ తెలిపాడు. ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ తెచ్చుకున్న అర్హ త్వరలో ‘శాకుంతలం’ సినిమాతో వెండితెరపైకి ఎంట్రీ ఇవ్వబోతుంది.