Sreeleela : శ్రీలీలను ఎత్తుకున్న బన్నీ.. ఈ కాంబినేషన్లో ఆహా కోసం స్పెషల్ మూవీ?
తాజాగా నేడు శ్రీలీల పుట్టిన రోజు కావడంతో ఈ ప్రాజెక్టు నుంచి సరికొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు ఆహా టీం. ఈ ఫొటోలో అల్లు అర్జున్ శ్రీలీలను ఎత్తుకొని స్టైల్ గా పోజు ఇచ్చాడు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.
Allu Arjun : తెలుగులో దూసుకుపోతున్న ఆహా ఓటీటీ(Aha OTT) ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్ లు, షోలతో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. తాజాగా అల్లు అర్జున్(Allu Arjun) తో ఆహా కొత్తగా ఏదో ప్లాన్ చేయబోతుంది. ఇటీవల త్రివిక్రమ్(Trivikram) డైరెక్షన్ లో అల్లు అర్జున్ అంటూ షూటింగ్ స్పాట్ లో వారిద్దరూ ఉన్న ఓ ఫోటోని విడుదల చేసింది ఆహా టీం. సరికొత్త మూవీ పండగ రాబోతుంది అని ప్రమోషన్స్ చేస్తుంది ఆహా.
గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్, శ్రీలీల(Sreeleela)తో ఓ షూట్ ని చేశారు. అదే ఈ ప్రాజెక్టు అని తెలుస్తుంది. అయితే అది యాడ్ షూటా లేదా ఆహా కోసం ఇంకేదైనా ప్లాన్ చేస్తున్నారా అని అభిమానులు, ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు. తాజాగా నేడు శ్రీలీల పుట్టిన రోజు కావడంతో ఈ ప్రాజెక్టు నుంచి సరికొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు ఆహా టీం. ఈ ఫొటోలో అల్లు అర్జున్ శ్రీలీలను ఎత్తుకొని స్టైల్ గా పోజు ఇచ్చాడు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. ఈ ఫోటోని షేర్ చేసి.. వీళ్ళిద్దరూ కలిసి స్టెప్పేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఆహా నుంచి రాబోతున్న అతిపెద్ద ప్రాజెక్టు కోసం వెయిట్ చేయండి అని ట్వీట్ చేశారు ఆహా టీం.
దీంతో ఈ ప్రాజెక్టు పై మరింత ఆసక్తి ఏర్పడింది. అసలు వీళ్ళిద్దర్నీ పెట్టి సినిమా చేస్తున్నారా? షో చేస్తున్నారా? లేదా ఇంకేదైనా ప్లాన్ చేస్తున్నారా అంటూ ఆహాని ప్రశ్నిస్తున్నారు అభిమానులు, నెటిజన్లు. ఇక అల్లు అర్జున్, శ్రీలీల సూపర్ డ్యాన్సర్లు కావడంతో వీరిద్దరి కాంబోలో డ్యాన్స్ అంటే ఓ రేంజ్ లో ఉండబోతుందని భావిస్తున్నారు. మరి ఆహా గ్రాండ్ గా ఏం ప్లాన్ చేస్తుందో తెలియాలంటే వెయిట్ చేయక తప్పదు. అభిమానులు, నెటిజన్లు శ్రీలీలకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
He is Iconic ⭐she is dreamy 💃. Veellu kalisi steppeste bomma blockbuster e🔥. Presenting @sreeleela14, our heroine for next aha Original…
Athi pedda ‘Movie’ Panduga cheskundama..?
Get ready for entertainment ‘tsunami’ 🎬🌊#AAtakesoverAha @alluarjun pic.twitter.com/7EK4DkbZT0— ahavideoin (@ahavideoIN) June 14, 2023