Pushpa : గతంలో ఎడమ భుజానికి సర్జరీలు.. ‘పుష్ప’లో భుజం పైకి పెట్టుకుని నటించడంతో…

సుక్కు ఈ కథ చెప్పినప్పుడే 'పుష్ప' సినిమాలో నా క్యారెక్టర్ ఎడమ భుజం పైకి పెట్టుకుని నటించాలి అని చెప్పాడు. నేను దానికి ఓకే చెప్పాను. కానీ ‘పుష్ప’లో ఎడమ భుజం పైకి పెట్టుకుని....

Pushpa : గతంలో ఎడమ భుజానికి సర్జరీలు.. ‘పుష్ప’లో భుజం పైకి పెట్టుకుని నటించడంతో…

Pushpa

Pushpa :  అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న మూడో సినిమా ‘పుష్ప’. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్నాడు. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. సమంత స్పెషల్ సాంగ్ కూడా చేయడం విశేషం. సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ బాగా వైరల్ అవ్వడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. మరో రెండు రోజుల్లో అంటే డిసెంబర్ 17న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవ్వబోతుంది. సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ జోరు పెంచారు.

ఈ ప్రమోషన్స్ లో భాగంగా నిన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి, తన పాత్ర గురించి తెలియచేశారు. ఈ సందర్భంగా మరో ఆసక్తికర విషయం చెప్పారు బన్నీ. అల్లు అర్జున్ ఈ సినిమాలో తన పాత్ర గురించి మాట్లాడుతూ.. సుక్కు ఈ కథ చెప్పినప్పుడే ‘పుష్ప’ సినిమాలో నా క్యారెక్టర్ ఎడమ భుజం పైకి పెట్టుకుని నటించాలి అని చెప్పాడు. నేను దానికి ఓకే చెప్పాను. కానీ ‘పుష్ప’లో ఎడమ భుజం పైకి పెట్టుకుని నటించడం వల్ల ఓ వారం పాటు బాగా నొప్పిగా ఉండేది. ఆ తర్వాత అలవాటయింది.

Vicky-Katrina : పెళ్లి తర్వాత మొదటిసారి మీడియాకి చిక్కిన బాలీవుడ్ కొత్తజంట

గతంలో 2005, 2011లో నా ఎడమ భుజానికి సర్జరీలు జరిగాయి. 2011లో అయితే సర్జరీ తర్వాత కోలుకోవడానికి 11 నెలలు పట్టింది. అందుకే వాటి వల్ల ఇప్పుడు ఇలా నటిస్తుంటే భుజం బాగా నొప్పి వచ్చింది. కానీ సినిమా కోసం చేయాలి అని ఛాలెంజింగ్ గా తీసుకొని చేసాను అని తెలిపారు.