Allu Arjun : తమిళ్ డైరెక్టర్‌తో బన్నీ పాన్ ఇండియా సినిమా

'పుష్ప' విజయంతో బన్నీతో సినిమా తీయడానికి వేరే సినీ పరిశ్రమల నుంచి కూడా డైరెక్టర్స్ వస్తున్నట్టు సమాచారం. విజయ్ తో వరుసగా మూడు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన అట్లీ డైరెక్షన్ లో.............

Allu Arjun : తమిళ్ డైరెక్టర్‌తో బన్నీ పాన్ ఇండియా సినిమా

Atlee Bunny

Allu Arjun :  ‘పుష్ప’ సినిమాతో భారీ విజయం అందుకొని అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. దేశంలోని అన్ని సినీ పరిశ్రమల నుంచి బన్నీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని భాషల్లోనూ భారీ విజయం సాధించి మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. దీంతో ఇక నుంచి బన్నీ తీసే ప్రతి సినిమా పాన్ ఇండియా సినిమాగానే తెరకెక్కుతుంది. ‘పుష్ప’ విజయంతో బన్నీతో సినిమా తీయడానికి వేరే సినీ పరిశ్రమల నుంచి కూడా డైరెక్టర్స్ వస్తున్నట్టు సమాచారం.

 

ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప 2’ చేయబోతున్నాడు. ఆ తర్వాత బోయపాటితో సినిమా ఉంటుంది. తర్వాత వేణు శ్రీరామ్ తో సినిమా ఉండే ఛాన్స్ ఉంది. తాజాగా మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. తమిళ్ లో ‘రాజా రాణి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి విజయ్ తో వరుసగా మూడు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన అట్లీ డైరెక్షన్ లో అల్లు అర్జున్ చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Trisha : వెబ్‌సిరీస్‌తో తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్న త్రిష

ప్రస్తుతం అట్లీ షారుఖ్ తో సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత మళ్ళీ విజయ్ తో మరో సినిమా చేస్తాడు. ఈ రెండిటి తర్వాత అల్లు అర్జున్ తో సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. నిన్నటి నుంచి తమిళ్, తెలుగు మీడియాల్లో బన్నీ-అట్లీ సినిమా ట్రెండ్ లో ఉంది. తమిళ భారీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మించనున్నట్లు సమాచారం. ఇదే కనుక నిజమైతే మరో భారీ సినిమా అల్లు అర్జున్ నుంచి రావడం ఖాయం.