Allu Arjun : ఈ బుల్లెట్ మీద ఎన్ని చలాన్లు ఉన్నాయో తెలుసా

‘పుష్ప’ సినిమాలో ‘శ్రీవల్లీ’ సాంగ్‌లో బన్నీ కూర్చుని ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ మీద చలాన్లు ఉన్నాయా?..

Allu Arjun : ఈ బుల్లెట్ మీద ఎన్ని చలాన్లు ఉన్నాయో తెలుసా

Bunny

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న హ్యట్రిక్ సినిమా ‘పుష్ప’.. ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీని మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా కలిసి నిర్మిస్తున్నాయి. రష్మిక మందన్న కథానాయిక.. మలయాళం యాక్టర్ ఫాహద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నారు.

RC-Gowtam : ‘జెర్సీ’ డైరెక్టర్‌తో రామ్ చరణ్

‘పుష్ప’ ఫస్ట్ సాంగ్ ‘దాక్కో దాక్కో మేక’ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. రీసెంట్‌గా ‘శ్రీవల్లీ’ సాంగ్ విడుదల చేయగా నెట్టింట వైరల్ అవుతోంది. దేవి శ్రీ ప్రసాద్ ట్యూన్‌కి చంద్రబోస్ లిరిక్స్ రాయగా.. సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు. బన్నీ వేసిన మూమెంట్స్ అయితే అదిరిపోయాయి.

Dussehra 2021: తెలుగు సినిమాలు.. దసరా శుభాకాంక్షలు..

ఆ పాటలో బన్నీ రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ మీద కూర్చుని కనిపిస్తాడు కదా.. అందుకు సంబంధించిన మీమ్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. బన్నీ కూర్చుని ఉన్న బైక్ నంబర్ ప్లేట్‌ని జూమ్ చేసి చూస్తే.. AP03L 5288 అని కనిపించగా.. నంబర్ ఎంటర్ చేసి చూస్తే ‘నో పెండింగ్ చలాన్స్’ అని చూపిస్తుందంట. ప్రస్తుతం ‘పుష్ప’ లో బన్నీ బైక్ మీమ్స్ హల్‌చల్ చేస్తున్నాయి.