Pushpa: వీకెండ్ పోయినా తగ్గేదేలే.. నాలుగో రోజు పుష్పరాజ్ భారీ వసూళ్లు

లెక్క పెరగాలే కానీ తగ్గేదే లే అంటున్నాడు పుష్ప రాజ్. ఫ్యాన్స్ ను ఓ రేంజ్ లో సాటిస్ ఫై చేసిన అల్లు అర్జున్.. నెవర్ బిఫోర్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్నాడు.

Pushpa: వీకెండ్ పోయినా తగ్గేదేలే.. నాలుగో రోజు పుష్పరాజ్ భారీ వసూళ్లు

Pushpa

Pushpa: లెక్క పెరగాలే కానీ తగ్గేదే లే అంటున్నాడు పుష్ప రాజ్. ఫ్యాన్స్ ను ఓ రేంజ్ లో సాటిస్ ఫై చేసిన అల్లు అర్జున్.. నెవర్ బిఫోర్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్నాడు. బన్నీ – సుకుమార్.. హ్యాట్రిక్ మూవీపై ఫస్ట్ నుంచి పెంచుకున్న అంచనాలకు తగ్గట్టు.. రిమార్కబుల్ ఓపెనింగ్స్ తో దుమ్మురేపింది పుష్ప ది రైజ్. 2021లో సాలిడ్ హిట్ కొట్టిన సినిమాగా నిలిచింది పుష్ప. ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా ఇండియా వైడ్ నంబర్ వన్ పొజిషన్ లో కూర్చున్నాడు పుష్పరాజ్.

Bheemla Nayak: వెనక్కు తగ్గిన భీమ్లా నాయక్.. ఫిబ్రవరికి వాయిదా!

రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు.. ఇలా రోజులు మారినా ఐకాన్ స్టార్ తొలి పాన్ ఇండియా సినిమా పుష్పకి వసూళ్లు మాత్రం తగ్గడం లేదు. రెండు, మూడు రోజులు వీకెండ్ కావడంతో సహజంగా భారీ అంచనాలున్న సినిమా కనుక ఎలాగూ కలెక్షన్లు ఆగవు. కానీ.. అనూహ్యం వీకెండ్ పోయి సోమవారం వర్కింగ్ డే నాలుగో రోజు కూడా పుష్ప మంచి వసూళ్లనే రాబట్టింది. పుష్ప ఒక్క నైజాంలోనే నాలుగవ రోజు 3.45 కోట్ల షేర్ ని రాబట్టిందంటే ఈ సినిమా ఏ స్థాయిలో వసూళ్లను రాబడుతుందో అర్ధం చేసుకోవచ్చు.

Pushpa : ‘పుష్ప’ పార్ట్ 2 రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన సుక్కు

ఇప్పటి వరకు నైజాం ఏరియాలో మొత్తం నాలుగు రోజులకి కలిపి పుష్పకి 26.5 కోట్ల షేర్ వచ్చిందట. దీనిని బట్టి చూస్తే బయ్యర్లు లాభాల్లోకి వెళ్ళినట్లే. మరో మూడు రోజుల పాటు ఏ సినిమా పోటీ లేకపోవడం పుష్పకి మరింతగా కలిసొచ్చే అవకాశం ఉండగా మొత్తానికి పుష్పరాజ్ వేట ఫలితం మామూలుగా ఉందని టాక్ నడుస్తుంది. నిజానికి పుష్పకి మిక్సెడ్ రివ్యూలు వచ్చినా బన్నీ మార్క్ నటనతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నట్లుగా కనిపిస్తుంది.