Allu Arjun : ‘రౌడీబాయ్స్’ ఈవెంట్లో ‘శ్యామ్ సింగరాయ్’ని పొగిడిన ఐకాన్ స్టార్

బన్నీ మాట్లాడుతూ... ‘‘నా ప్రయాణం ‘ఆర్య’ సినిమాతో మొదలుపెట్టాను. దిల్‌ రాజు గారు నా ప్రయాణంలో ఒక భాగం. ఆయన లేకుంటే ‘ఆర్య’ లేదు. ‘రౌడీ బాయ్స్‌’ ఫంక్షన్‌ నాకు చాలా ప్రత్యేకం......

Allu Arjun : ‘రౌడీబాయ్స్’ ఈవెంట్లో ‘శ్యామ్ సింగరాయ్’ని పొగిడిన ఐకాన్ స్టార్

Hpifvjfjmfc Hd (1)

Allu Arjun :   దిల్ రాజు అన్న కొడుకు ఆశిష్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘రౌడీబాయ్స్’. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవ్వనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి కొన్ని సాంగ్స్, ట్రైలర్ రిలీజ్ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘డేట్‌ నైట్‌..’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ పాటని లాంచ్ చేయడానికి అల్లు అర్జున్ విచ్చేశారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ఈ ఈవెంట్లో ‘డేట్‌ నైట్‌..’ అంటూ సాగే పాటను అల్లు అర్జున్‌ విడుదల చేశాడు.

అనంతరం బన్నీ మాట్లాడుతూ… ‘‘నా ప్రయాణం ‘ఆర్య’ సినిమాతో మొదలుపెట్టాను. దిల్‌ రాజు గారు నా ప్రయాణంలో ఒక భాగం. ఆయన లేకుంటే ‘ఆర్య’ లేదు. ‘రౌడీ బాయ్స్‌’ ఫంక్షన్‌ నాకు చాలా ప్రత్యేకం. ఇది నా కుటుంబ వేడుక. ఇందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఊరు వెళ్లాల్సి ఉంది. అయినా ఇక్కడికొచ్చాను. ఇది నేను చేస్తున్న ఫేవర్‌ కాదు నా బాధ్యత. ఆశిష్‌ని లాంచ్‌ చేస్తున్న ఈ వేడుకలో నేనూ భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉంది. ‘రౌడీ బాయ్స్‌’ ట్రైలర్‌ చూస్తుంటే ఫిబ్రవరి 14న రిలీజ్‌ చేయాల్సిన సినిమా జనవరి 14నే విడుదల చేస్తున్నట్లు ఉంది. ఆశిష్‌ చాలా బాగా డ్యాన్స్‌ చేశాడు. డైరెక్టర్ శ్రీహర్ష, ఆశిష్, యూనిట్‌ అందరికి ఆల్‌ ది బెస్ట్‌.” అని అన్నారు.

Khushbu Sundar : సీనియర్ నటి, తమిళ బిజెపి నాయకురాలు ఖుష్భుకి కరోనా పాజిటివ్

ఆ తర్వాత ఇటీవల రిలీజ్ అయినా సినిమాల గురించి మాట్లాడుతూ.. ”లాక్‌డౌన్‌ తర్వాత డిసెంబరులో విడుదలైన సినిమాలు అఖండ, పుష్ప, శ్యామ్‌ సింగరాయ్‌ సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్నాయి. ‘శ్యామ్‌ సింగరాయ్‌’ సినిమా చాలా బాగుంది. నాని, సాయిపల్లవి నటన బాగుంది. డైరెక్టర్‌ రాహుల్‌ చాలా బాగా తీశాడు. ఎవరికైనా సినిమా థియేటర్ కి వెళ్లి చూడటం కుదరకపోతే ‘శ్యామ్ సింగరాయ్’ ఓటీటీలో వచ్చినప్పుడైనా చూడండి’’ అని బన్నీ ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాపై ప్రశంశలు కురిపించాడు..