Allu Arjun : ‘రాకీ భాయ్‌’ పై ‘పుష్ప’ స్పెషల్ ట్వీట్..

తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు. 'కేజీఎఫ్‌ 2' సినిమా చుసిన బన్నీ..''కేజీఎఫ్‌ 2 చిత్ర యూనిట్‌కు అభినందనలు. యశ్‌ గారు మీ నటన.....

Allu Arjun : ‘రాకీ భాయ్‌’ పై ‘పుష్ప’ స్పెషల్ ట్వీట్..

Pushpa

 

KGF 2 :  ప్రస్తుతం దేశమంతటా ‘కేజీఎఫ్‌ 2’ సంచలనం సృష్టిస్తుంది. సినిమా రిలీజ్ అయి వారం రోజులు దాటినా ఇంకా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వసూల్ కురిపిస్తుంది. ఇక ఈ సినిమా బాలీవుడ్ లో అయితే మరింత భారీ విజయాన్ని సాధించింది. అన్ని భాషల ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు సైతం ‘కేజీఎఫ్‌ 2’ సినిమాపై అభినందనలు కురిపిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది స్టార్లు, సెలబ్రిటీలు ఈ సినిమా చూసి ప్రశంసిస్తూ ట్వీట్స్ చేశారు.

 

తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘కేజీఎఫ్‌ 2’ సినిమా చుసిన బన్నీ..”కేజీఎఫ్‌ 2 చిత్ర యూనిట్‌కు అభినందనలు. యశ్‌ గారు మీ నటన అద్భుతం. సంజయ్‌ దత్‌, రవీనా టండన్‌, శ్రీనిధి శెట్టి మరియు మిగిలిన నటులంతా కూడా బాగా నటించారు. రవి బస్రూర్‌ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందించారు. కెమెరామన్ భువనగౌడ ఎక్సలెంట్‌ విజువల్స్‌ అందించారు. ఈ సినిమాకి పని చేసిన సాంకేతిక నిపుణులందరికి గౌరవాభినందనలు” అని ట్వీట్‌ చేశాడు.

Senior Heroes: పేరుకే సీనియర్లు.. దూకుడులో కుర్ర హీరోలతో పోటీ!

దీంతో పాటు మరో ట్వీట్ కూడా చేశాడు బన్నీ. ఈ ట్వీట్ లో సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ని అభినందించారు. ఈ ట్వీట్ లో.. ”డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌ ఒక అద్భుతమైన సినిమా ఇచ్చారు. మీ దృక్పథానికి, విశ్వాసానికి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాను. ఒక మంచి సినిమాటిక్ అనుభూతిని అందించినందుకు & భారతీయ సినిమా పతాకాన్ని ఎగురవేస్తున్నందుకు ఈ సినిమాలో పాలుపంచుకున్న అందరికి ధన్యవాదాలు” అంటూ పోస్ట్ చేశారు. బన్నీ ఇలా ‘కేజీఎఫ్‌ 2’ సినిమాని పొగుడుతూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. కన్నడ ప్రేక్షకులు ఈ ట్వీట్ ని మరింత షేర్ చేస్తున్నారు.