Amazon-Flipkart పోటాపోటీ : ఆఫర్లే ఆఫర్లు.. భారీ డిస్కౌంట్లు!

ఈ-కామర్స్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ దిగ్గజాలు పోటాపోటీగా ఆఫర్లు గుప్పిస్తున్నాయి. కస్టమర్లను ఆకట్టుకునేందుకు బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రకటిస్తున్నాయి.

Amazon-Flipkart పోటాపోటీ : ఆఫర్లే ఆఫర్లు.. భారీ డిస్కౌంట్లు!

Amazon Flipkart Festival Sale From October 2021

Amazon-Flipkart Festival Sale : ఈ-కామర్స్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ దిగ్గజాలు పోటాపోటీగా ఆఫర్లు గుప్పిస్తున్నాయి. కస్టమర్లను ఆకట్టుకునేందుకు బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రకటిస్తున్నాయి. ఫ్లిప్ కార్ట్ (Flipkart) బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ కు పోటీగా అమెజాన్ కూడా Amazon The Great Festival Sale ప్రకటించింది. ఈ సేల్ అక్టోబర్‌ 4 నుంచి ప్రారంభం కానుంది. అక్టోబర్‌ 3 నుంచే సేల్ ప్రారంభించనున్నట్టు అమెజాన్‌ ప్రకటించింది. ఆసక్తి గల కస్టమర్లు.. అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్స్‌ ‘ది గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌’లో పాల్గొనవచ్చు.
Apple iPhone 14 Series: ఆపిల్ ఐఫోన్ 14 ఫీచర్స్ లీక్.. లుక్ అదిరిపోయింది

ఈ సేల్ నెలరోజుల పాటు కొనసాగనుంది. మరోవైపు ప్లిప్‌కార్ట్‌ కూడా బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ను అక్టోబర్‌ 7 నుంచి ప్రకటించింది. ఇప్పుడా ఈ సేల్‌ తేదీని ఫ్లిప్‌కార్ట్‌ మార్చేసింది. Flipkart బిగ్‌బిలియన్‌ డేస్‌ సేల్‌ అక్టోబర్‌ 3 నుంచి అక్టోబర్‌ 10 వరకు కొనసాగనుంది.

అమెజాన్లు, ఫ్లిప్ కార్ట్ ప్లాట్ ఫాంలు ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తున్నాయి. అమెజాన్‌ ది గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌, బిగ్‌బిలియన్‌ డేస్‌ సేల్‌ లో భాగంగా కస్టమర్లకు స్మార్ట్‌ఫోన్‌, మొబైల్‌ యాక్సెరీస్‌, ఎలక్ట్రానిక్స్‌, ఫ్యాషన్‌ ప్రొడక్టులపై  భారీ ఆఫర్లు, డిస్కౌంట్లను ప్రకటించనున్నాయి.

శాంసంగ్ నుంచి సెప్టెంబర్ 28 మధ్యాహ్నం 12 గంటలకు గెలాక్సీ M52 5G లాంచ్ కానుంది. ఫ్లిప్‌కార్ట్ లో శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ టీజ్ కానుంది. శాంసంగ్ కంపెనీ ట్వీట్​ ద్వారా వెల్లడించింది. గెలాక్సీ M52 5G సేల్స్ అమెజాన్ ద్వారా కొనసాగనుంది. ఒప్పో కంపెనీ సెప్టెంబర్ 27న ఒప్పో A55 లాంచ్ చేయనుంది. పోకో, వివో సెప్టెంబర్ 30వ తేదీన మోటరోలా అక్టోబర్ 1న కొత్త ఫోన్లను లాంచ్​ చేయనున్నాయి. ఫ్లిప్​కార్ట్​ బిగ్​బిలియన్​ డేస్​ సేల్​ ద్వారా ఫస్ట్ సేల్ ప్రారంభం కానుంది.
Apple iPhone 13: ఇండియాలో అదేరోజు.. ఆపిల్ ఐఫోన్ 13 గ్లోబల్ లాంచ్!