Bro Movie : బ్రో మూవీకి ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్న అంబటి రాంబాబు? సినిమా మీద ఇంట్రెస్ట్ మరింత పెంచేస్తున్నారు..

సాధారణంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక సినిమా వీకెండ్స్ మూడు రోజులు ఆడటమే కష్టం, స్టార్ హీరో సినిమా మహా అయితే వారం రోజులు. ఆ తర్వాత ఏ సినిమా అయినా ఇంటికి వెళ్లిపోవాల్సిందే. బ్రో సినిమాకి ఎలాగో మూడు రోజుల్లో రావాల్సిన కలెక్షన్స్ వచ్చాయి.

Bro Movie : బ్రో మూవీకి ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్న అంబటి రాంబాబు? సినిమా మీద ఇంట్రెస్ట్ మరింత పెంచేస్తున్నారు..

Ambati Rambabu doing free publicity for Bro Movie Social media Trolls goes Viral

Bro Movie : పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కాంబినేషన్ లో వచ్చిన ‘బ్రో’ మూవీ చుట్టూ ఏపీ పాలిటిక్స్ తిరుగుతున్నాయి. జులై 28న రిలీజ్ అయిన ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకొని ఆల్రెడీ మూడు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. అయితే ఈ సినిమాలో ‘శ్యాంబాబు’ అనే పాత్ర ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఇరిగేషన్ మంత్రి ‘అంబటి రాంబాబు’ని పోలి ఉంది అంటూ ఆడియన్స్ మాట్లాడడం, అందుకు సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట వైరల్ అవ్వడంతో అంబటి దానిపై రెస్పాండ్ అయ్యారు.

ఈ క్రమంలోనే పవన్ పై విమర్శలు చేస్తూ, బ్రో మూవీ కలెక్షన్స్ లెక్కలు చెబుతూ గత మూడు రోజుల నుంచి అంబటి మీడియా ముందు హడావిడి చేస్తూ వస్తున్నారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ బ్రో సినిమాని, పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తున్నారు. బ్రో సినిమా లావాదేవీలపై అనుమానాలు ఉన్నాయంటూ దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తానని అన్నారు. ఢిల్లీలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డితో మాట్లాడిన తర్వాత తమ పార్టీ నేతలతో కలిసి దర్యాప్తు సంస్థలకు అంబటి పిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.

ఈ విషయంలో అంబటిపై విమర్శలు దారుణంగా వస్తున్నాయి. సోషల్ మీడియాలో అయితే ట్రోల్స్ కూడా భారీగా వస్తున్నాయి. ఒక ఇరిగేషన్ మినిష్టర్ అయి ఉండి ప్రజల గురించి, ఏపీ గురించి, పోలవరం లెక్కల గురించి మాట్లాడకుండా ఇలా ఒక సినిమా కలెక్షన్స్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని నెటిజన్లు, ప్రజలు విమర్శలు చేస్తున్నారు. అయితే అంబటి చేసే హడావిడి బ్రో సినిమాకి నెగిటివ్ కంటే పాజిటివ్ అవ్వడం విశేషం.

సాధారణంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక సినిమా వీకెండ్స్ మూడు రోజులు ఆడటమే కష్టం, స్టార్ హీరో సినిమా మహా అయితే వారం రోజులు. ఆ తర్వాత ఏ సినిమా అయినా ఇంటికి వెళ్లిపోవాల్సిందే. బ్రో సినిమాకి ఎలాగో మూడు రోజుల్లో రావాల్సిన కలెక్షన్స్ వచ్చాయి. ఆ తర్వాత మెల్లిగా వస్తాయి వీక్ డేస్ కాబట్టి. ఇంకో నాలుగు రోజుల్లో పక్కకి వెళ్లిపోయే సినిమాని అంబటి రాంబాబు ప్రెస్ మీట్స్ పెట్టి మరీ ప్రమోషన్స్ చేస్తున్నారు. అందులో ఏదో వివాదం ఉందంటూ భూతద్దంలో చూపిస్తున్నారు. దీంతో ఇప్పటివరకు పవన్ ఫ్యాన్స్, సినిమా లవర్స్, కొంతమంది ప్రేక్షకులు చూసిన సినిమాని ఇప్పుడు మిగిలిన వాళ్లంతా వచ్చి చూస్తున్నారు. అభిమానులు, నెటిజన్లు బ్రో సినిమాని అంబటి రాంబాబు ఫ్రీగా పబ్లిసిటీ చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు.

Krishna Gadu Ante Oka Range : ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’ మూవీ రివ్యూ.. ఎమోషన్స్ తో కూడిన విలేజ్ ప్రేమకథ..

అసలు సినిమాలో వివాదం అవ్వడానికి ఏముంది, అంబటి రాంబాబుని ఎలా చూపించారు, అంబటి ఈ రేంజ్ లో హడావిడి చేయడానికి సినిమాలో ఏముంది అనుకుంటూ ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తున్నారు. ఇక నేటి నుంచి ఎలాగో మూడు రోజులు వీకెండ్ కావడం, సినిమా హిట్ టాక్ రావడం, ఈ వారం పెద్ద సినిమాలు లేకపోవడం.. వీటన్నిటికీ తోడు బ్రో సినిమాని అంబటి రాంబాబు ఫ్రీగా పబ్లిసిటీ చేయడంతో ఈ మూడు రోజుల్లో కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది.